జై సింహా విడుదలకు సిద్ధమైంది. ఈనెల 12న సంక్రాంతి కానుకగా రాబోతోంది. గురువారం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రమోషన్ పర్వంలోకి దిగింది. ఈనెల 8న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. బాలయ్యతో పనిచేసిన దర్శకులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతారు. బోయపాటి, క్రిష్, తేజ… వీళ్లంతా ఈ వేడుకలో కనిపించే అవకాశం ఉంది. సరిగ్గా విడుదల రోజున బాలయ్య తిరుపతి వెళ్లనున్నారు. అక్కడ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు, ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. ‘గౌతమి పుత్ర’ తరవాత బాలయ్య పెద్దగా విశ్రాంతి తీసుకోలేదు. ఆ వెంటనే ‘పైసా వసూల్’ సినిమా హడావుడిలో పడిపోయారు. ‘జై సింహా’కీ ఎన్టీఆర్ బయోపిక్కీ కాస్త విరామం దొరుకుతోంది. అందుకే ఈలోగా కొన్ని రోజులు కుటుంబంతో జాలీగా గడపాలన్నది బాలయ్య ఆలోచన.