`జై సింహా`లో బాలయ్య రెండు గెటప్పుల్లో కనిపిస్తాడని అందరికీ తెలిసిపోయింది. చిత్రబృందం కూడా రెండు గెటప్పులతో ఉన్న పోస్టర్లని విడుదల చేసింది. కానీ బాలయ్య ఈ సినిమాలో ఏం చేస్తుంటాడు? అనేది మాత్రం చెప్పలేదు. ఈ సినిమాలో బాలయ్య ఓ మెకానిక్‌గా కనిపిస్తాడు. తన షెడ్డుకొచ్చిన బండ్లని రీపేర్ చేయడమే కాదు… సమాజంలో మనుషుల్ని రీపేర్ చేస్తుంటాడు. జనతా గ్యారేజ్ లో.. ఎన్టీఆర్‌లా!
ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా ఇంట్రవెల్ మాస్, కమర్షియల్ సినిమాల్లోని ఇంట్రవెల్లా పంచ్ డైలాగులతో ఉండదు. ఓ సెంటిమెంట్ సీన్ తో ఇంట్రవెల్ బ్యాంగ్ ప్రిపేర్ చేశార్ట. అక్కడ నయనతార పాత్రకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వబోతోందని సమాచారం. సెన్సార్ రిపోర్ట్ చాలా పాజిటీవ్‌గా వచ్చింది. మాస్కే కాదు, మహిళలకూ నచ్చే సినిమా ఇదని చిత్రబృందం చెబుతోంది. ట్రైలర్ చూస్తే మాస్ మాత్రమే కనిపిస్తోంది. సెంటిమెంట్ టీజర్లను ఒకొక్కటిగా విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది.