హైపర్ ఆది వర్సెస్ కత్తి మహేష్ వ్యాఖ్యల పర్వం గత కొంత కాలంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కత్తి మహేష్ వ్యాఖ్యలు ఈ మధ్య మరీ శ్రుతి మించింట్టు జనాలకి కూడా అనిపించిస్తోంది. “పవన్ కళ్యాణ్ హెచ్ ఐవి వైరస్ కంటే సమాజానికి ఎక్కువ ప్రమాదం”, “అరేయ్, ఒరేయ్” లాంటి పదజాలం (పవన్ ని ఉద్దేశ్యించి), దమ్ముంటే నాతో చర్చ కి రమ్మంటూ పవన్ పై సవాళ్ళు – కత్తి మహేష్ చేయడం, కత్తి మహేష్ సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వెంటనే టివి9 లో అది ప్రముఖంగా స్క్రోల్ అవడం, ఆ పై కాసేపటికే దాని మీద గంటల తరబడి డిబేట్ జరగడం – ఇవన్నీ చూసి సామాన్య ప్రేక్షకుడు కూడా “ఏంటి మాకీ గోల” అనుకునేలా టివి ప్రోగ్రాంస్ ఉంటున్నాయి అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. సరిగ్గా ఇదే విషయం పై స్పందించాడు హైపర్ ఆది. ఆయన ట్వీట్ ఇదీ-
“మెరుగైన సమాజం కోసం (TV9) అని చూపించి …ఉన్న సమాజాన్ని పాడు చేస్తున్నారు గొడవలు సృష్టించి. నీ వృత్తికి నీవు న్యాయం చేస్తే వచ్చే శాటిస్ఫాక్షన్ నువ్వు ఇలా దొడ్డి దారిలో no.1 TRP లు తెచ్చుకున్న కలుగదు…. మీడియా తోనే మార్పు సాద్యం please దాని miss Use చేయకండి”
అయితే టివి9 లాంటి ప్రముఖ మీడియాని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం ఇదేమీ మొదటి సారి కాదు. గతం లో కూడా “కృష్ణా నది లో బోటు మునిగిపోయిన ప్రమాదం లో అంత మంది చనిపోతే, ఆ సమయం లో కూడా కత్తి మహేష్ తో పవన్ మీద డిబేట్ పెట్టించారు, అది ఎంతవరకు సమంజసం” అని లైవ్ లో ప్రశ్నించి, టివి9 యాంకర్ ని ఉక్కిరిబిక్కిరి చేసాడు. ఇక టివి9 ఛానెల్ కూడా తక్కువేమీ తినలేదు. జబర్దస్త్ ప్రోగ్రాం లో హైపర్ ఆది వేసే సెటైర్స్ లో శ్రుతిమించిన ఒక సందర్భం దొరకగానే ఒక వీకెండ్ లో దాదాపు 6 గంటల స్క్రీన్ సమయం హైపర్ ఆది కి, జబర్దస్త్ కీ వ్యతిరేకమైన డిబేట్ కి కేటాయించింది.
ఏది ఏమైనా ఇప్పుడు తెలుగు మీడియా లో కొన్ని ఛానెల్స్ ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాలకి సంబంధించినంత వరకూ ఇప్పుడు -కత్తి మహేష్, హైపర్ ఆది, పూనం కౌర్, కోన వెంకట్ – ఇవే ప్రధాన సమస్యలు. ఈ సమస్యలపై ఎంత లోతుగా, ఎంత ఎక్కువగా చర్చిస్తే, తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన సమాజం అంత అర్జంటుగా ఏర్పడుతుందనేది ఆ ఛానెల్స్ అభిప్రాయం లాగుంది.