అజ్ఞాతవాసి.. టాపిక్ ఆఫ్ ది వీక్! ఈ సినిమా ఎంత హిట్టవుతుంది? ఏ మేర వసూళ్లు సాధిస్తుందన్నది ఓ హాట్ పాయింట్ అయితే.. అజ్ఞాతవాసి కాపీ జరిగిందా? జరిగితే టీ సీరీస్తో సెటిల్మెంట్ ఎంత? ఆ డబ్బులు ఎవరిచ్చారు? అనేది మరో పెద్ద హాట్ న్యూస్. ఓ ఫ్రెంచ్ సినిమాకి కాపీ.. అజ్ఞాతవాసి అన్నది రూఢీ అయిపోయింది. ఆ హక్కులు టీ సిరీస్ దగ్గర ఉన్నాయి. కాబ్టటి లీగల్గా చూస్తే.. ‘అజ్ఞాతవాసి’కి అడ్డంకులు ఎదరయ్యే ప్రమాదం ఏర్పడింది. దాన్నుంచి తప్పించుకోవడానికి సెటిల్మెంట్కి దిగి రాక తప్పలేదు. టీ సిరీస్ కి దాదాపుగా రూ.15 కోట్లు ముట్టజెప్పారని, ఈ మొత్తం పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ ఇచ్చారని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.
నిజానికి ఈ సెటిల్మెంట్ రూ.1 కోటి రూపాయల్లోపు జరిగిపోయిందట. ఆ డబ్బులు కూడా నిర్మాత ఎకౌంట్లోంచే ఇచ్చారన్నది విశ్వసనీయ వర్గాల మాట. ఫ్రెంచ్ సినిమాలు రీమేక్ కోసం ఎవ్వరూ కోట్లలో పెట్టి కొనరు. పది, పదిహేను లక్షలు ఇచ్చినా.. రీమేక్ రైట్స్ ఇచ్చేస్తారు. అందుకోసం రూ.15 కోట్లు వెచ్చించడం మూర్ఖత్వం. ఒకవేళ కోర్టుకు వెళ్లినా ఈ ఇష్యూ నిలబడేది కూడా కాదు. ఎందుకంటే కాపీ రైట్స్ చట్టం ఆ రేంజులో ఉంది. వరుసగా ఏడెనిమిది సన్నివేశాలు మక్కీకి మక్కీ దించితే తప్ప అది కాపీ అనిపించుకోదు. మధ్యలో మనదైన సన్నివేశం జోడిస్తే అది కాపీ కానట్టే లెక్క. త్రివిక్రమ్ ఎలాగూ మక్కీకి మక్కీ దించేయడు. కాబట్టి న్యాయ స్థానంలోనూ… కాపీ కేసు నిలబడకపోవొచ్చు. దాని కోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తారా?? రూ.10 కోట్లు ఇచ్చాం, పదిహేను ఇచ్చాం అనుకుంటే సినిమాకీ, ఆ కథకీ అదో రకమైన మైలేజీ. అందుకే చిత్రబృందం కూడా ఈ విషయంలో పెదవి విప్పడం లేదు.