నిన్నంతా కత్తి మహేష్ ప్రోగ్రాం తో మోతమోగించాయి ఛానెళ్ళు. ప్రత్యేకించి టివి9 అయితే కత్తి మహేష్ కి భోజనం చేసే గ్యాప్ కూడా ఇవ్వకుండా దాదాపు ఐదుగంటలపాటు లైవ్ లో కూర్చోపెట్టింది. మధ్యలో యాంకర్ “అతిథిని గౌరవించడం మా బాధ్యత, చిన్న బ్రేక్ తీసుకుని, కత్తి మహేష్ గారికి తినడానికి రిఫ్రష్మెంట్స్ లాంటివి ఇస్తాం, అదయ్యాక మళ్ళీ మన ప్రోగ్రాం కొనసాగిస్తాం” అని చెప్పి బ్రేక్ తీసుకుని మళ్ళీ బ్రేక్ అయ్యాక ప్రోగ్రాం కొనసాగించారు.
ఈ ప్రోగ్రాం కి ముందు కత్తి మహేష్- పూనం కౌర్ కానీ, పవన్ కానీ, వాళ్ళ తరపు వారు కానీ తనతో చర్చకి రావాలని సవాల్ చేసి, చెప్పిన సమయానికి చెప్పిన చోట కి వచ్చారు. ఊహించినట్టే, పవన్ తరపు నుంచి ఎవరూ రాలేదు. ఇక కత్తి మహేష్ కూడా షరా మామూలుగా తాను చేసే విమర్శలు కొన్ని చేసి చర్చకి అవతలివాళ్ళు భయపడ్డారని ఎద్దేవా చేసి వెళ్ళిపోతాడని అందరూ భావించారు. కానీ అందరికీ దిమ్మ తిరిగిపోయే షాకిస్తూ, పూనం కౌర్ ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేసింది, పవన్ కళ్యాణ్ క్షుద్రపూజలు ఎందుకు చేసాడు లాంటి సంచలన ప్రశ్నలు కురిపించి ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ కే కాక అందరికీ మైండ్ బ్లాక్ చేసేసాడు కత్తి మహేష్ . ఇక ఆ పై టివి9 లైవ్ లో కాలర్స్ తో ప్రశ్నలు తీసుకుంది. దాదాపు 12 వేల కాల్స్ వచ్చాయని ప్రకటించింది. అయితే కాల్స్ చేసిన వాళ్ళలో చాలా మంది (పదింటికి తొమ్మిది మంది) అసలు టివి9 ఎందుకని ఇంతలా కత్తి మహేష్ ని ఎంటర్టైన్ చేస్తున్నారని సందేహం వ్యక్తం చేసినవాళ్ళే. మజీ ఎమ్మెల్యే ఈలి నాని వంటి వాళ్ళు కూడా, “ఇంకే ప్రజా సమస్యలు లేనట్టు, ఎందుకింత సమస్య మీద హడావిడి చేస్తున్నారు” అంటూ సున్నితంగా సెటైర్ వేసారు.
ఇక తెలుగు మీడియాకి సంబంధించినతవరకూ టివి9 “పయనీర్” ఛానెల్. అది ఏ బాట చూపిస్తే మిగతా ఛానెల్స్ కూడా అదే బాటలో పయనిస్తాయి. కాబట్టి మిగతా ఛానెల్స్ కూడా ఇదే “లైవ్ కాల్స్” ప్రోగ్రాం ని కంటిన్యూ చేసాయి. అయితే మొత్తానికి టివి9 పై పవన్ అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. టివి9 లో మాట్లాడిన కాలర్స్ ప్రధానంగా టివి9 పై కురిపించిన ప్రశ్నలు, సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్న ప్రశ్నలు,స్పష్టమైన సమాధానం చెప్పడానికి ఇబ్బందిపడ్డ ప్రశ్నలు ఇవీ –
- 1. అసలు ఏ ప్రజా సమస్యలు లేనట్టు రోజంతా కత్తి మహేష్ ని మీరు ఎందుకు మా మీద రుద్దుతున్నారు? TRP ల కోసమా? – అయితే ఈ ప్రశ్నకి టివి9 యాంకర్ బదులిచ్చారు. టివి9 కి TRPలు ఇప్పుడు కత్తి మహేష్ కారణంగా కొత్తగా రాలేదు, అలాగే కత్తి మహేష్ వెళ్ళిపోయాక TRPలు లేకుండా పోవు అని. యాంకర్ చెప్పినట్టు TRP లు కొత్తగా కత్తిమహేష్ వల్ల రాకపోయి ఉండొచ్చు కానీ, కాలర్స్ అసలు ప్రశ్నకి సమాధానం చెప్పలేదు టివి9. ఈ ప్రశ్న దాదాపు అన్ని ఛానెళ్ళకూ ఎదురైంది. అదీ చాలా మంది కాలర్స్ తో.
- 2. టివి9 ఇటీవలి కాలం లో ఏ “సింగిల్” ప్రజా సమస్య పై కూడా కత్తి మహేష్ పై వెచ్చించినంత సమయం ఎందుకు వెచ్చించలేదు. పుష్కరాల్లో 29 మంది చనిపోయిన అంశం పై గానీ, కృష్ణా నది ప్రమాదం విషయం లో కానీ, ప్రభుత్వాలని ఇరుకునపెట్టే ఏ సమస్య పై కూడా కత్తి మహేష్ సమస్య పై కేటాయించినంత సమయం లో 10 శాతం సమయం కూడా టివి9 ఎందుకు కేటాయించలేదు.
- 3. కాల్ చేసిన వాళ్ళలో కొందరు (బహుశా వైసిపి ఫ్యాన్స్), ప్రతిపక్షనేత పాదయాత్ర చేస్తూంటే సరైన కవరేజ్ ఇవ్వకుండా ఉన్న టివి9 – కత్తి మహేష్, పూనం కౌర్ లాంటి విషయాల్లో ఎందుకింత ఎక్కువ చేస్తున్నారు. ఇవి ఏ రకంగా ప్రజా సమస్యలు, వీటి వల్ల ప్రజలకి ఏ రకంగా మేలు జరుగుతుంది అని ప్రశ్నించారు. .
ఇక టివి9 కే కాక కత్తి మహేష్ పై కూడా కాలర్స్ ప్రశ్నలు కురిపించారు. కొంతమంది శ్రుతి మించి మాట్లాడితే, టివి9 వాళ్ళే, వారిని కంట్రోల్ చేయడమో, కాల్ కట్ చేయడమో చేసారు. కానీ కత్తి మహేష్ ప్రధానంగా సమాధానం చెప్పుకోలేకపోయిన ప్రశ్నలు ఇవీ-
- 1. పవన్, త్రివిక్రం లు కలిసి క్షుద్రపూజలు చేసారనీ, తన దగ్గర స్పష్టమైన వీడియో ఆధారాలున్నాయని, పూనం కౌర్ ఆత్మహత్యా యత్నానికి సంబంధించి కూడా తనదగ్గర ఆధారాలున్నాయని చెప్పుకొచ్చిన కత్తి మహేష్ ఆ ఆధారాలని బయటపెట్టమని యాంకర్ ఎన్నిరకాలుగా అభ్యర్థించినప్పటికీ బయటపెట్టలేదు. ఇంతలో టివి9 బృందమే (బ్యాక్ ఎండ్ టీం) అవి క్షుద్ర పూజలు కాదనీ, సాధారణ పూజలనీ నిర్ధారించి అవి జరిగిన సమయం, స్థలం కూడా రివీల్ చేసింది. సో, తన దగ్గర ఉన్నాయని చెబుతున్న ఆధారాలని బయటపెట్టమని కోరిన ప్రశ్నలన్నింటినీ కత్తి దాటవేసాడు.
- 2. ఇక మిమ్మల్ని వేధించిన వాళ్ళ మీద ఎందుకని మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అన్న ప్రశ్న కి కూడా కత్తి మహేష్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. ఒకసారి “వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయటం ఇష్టం లేక” అనీ, ఇంకొకసారి “పోలీసులు కూడా ఇన్ని వేల మందిని ఎలా ట్రేస్ చేస్తారని”, ఇంకొకసారి “పోలీసుల వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకి లేదనీ” చెప్పుకొచ్చారు. అత్యంత ఎక్కువ మంది వేసిన ప్రశ్న కూడా బహుశా ఇదే. దాదాపు అందరూ ఈ ప్రశ్న వేసారు – ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పరిష్కరించుకోవచ్చు గా ఈ సమస్యని అంటూ.
అసలు టివి9 ఎందుకని ఇంతలా కత్తి దూస్తోంది అన్న విషయమై కూడా భిన్న వాదనలు వినవస్తున్నాయి. అయితే అందులో ఏవి నిజాలు అన్నది తేలడానికి మాత్రం సమయం పడుతుంది.