జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకి నామినేషన్లు వేసేందుకు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకే గడువు ఉంది. తెరాస, కాంగ్రెస్, వామపక్షాలు తదితర అన్ని పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించి నామినేషన్లు కూడా వేస్తున్నాయి. కానీ తెదేపా, బీజేపీలు ఇంతవరకు తమ అభ్యర్ధుల జాబితాలను విడుదల చేయలేదు. తెదేపా 90 డివిజన్లలో, బీజేపీ 60 డివిజన్లలో పోటీ చేయడానికి మొదట అంగీకారం కుదిరింది. తరువాత బీజేపీ జాతీయ స్థాయి నాయకుల ఒత్తిడి మేరకు తెదేపా మరో మూడు సీట్లను బీజేపీకి అప్పగించి 87 స్థానాల నుండే పోటీకి సిద్దపడుతోంది. నామినేషన్లు వేయడానికి ఈరోజే ఆఖరి రోజు. పైగా మధ్యాహ్నం మూడు గంటల వరకే సమయం మిగిలి ఉంది కనుక సమయం గడుస్తున్న కొద్దీ రెండు పార్టీలలో ఆశావాహులలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొద్ది సేపటిలో రెండు పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించవచ్చును.