బాహుబలి తరవాత.. అనుష్క నటించిన చిత్రం భాగమతి. ఎప్పుడో మొదలైంది. కానీ క్వాలిటీ విషయంలో యూవీ క్రియేషన్స్ కాంప్రమైజ్ కాకపోవడంతో ఈ సినిమా బయటకు రావడం ఆలస్యమవుతూ వస్తోంది. ఈనెలలోనే భాగమతిని చూడొచ్చు. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే… ఇది హారర్, థ్రిల్లర్ సినిమా అనేది తెలిసిపోతోంది. టాలీవుడ్‌ని భయపెట్టబోతున్న మరో ఆత్మ కథని అర్థమవుతోంది. గత జన్మల నేపథ్యాలూ ఈ కథలో మిళితం చేశాడు దర్శకుడు అశోక్. ఓ కేసు విచారణ నిమిత్తం అనుష్కని ఓ బంగ్లాకి తీసుకొస్తారు. అక్కడ ఆమెతో ఓ ఆత్మ ఆడుకుంటుంది. ఆ ఆత్మ ఎవరిది? ఏమిటి? అనేదే మిగిలిన కథ. కాస్త థ్రిల్లర్, ఇంకాస్త హిస్టారికల్, కాస్త పొలిటికల్ డ్రామా మేళవిస్తే.. భాగమతి. చివర్లో అరుంధతి లాంటి అనుష్క కనిపించింది. డైలాగ్ చెబుతూ అనుష్క ఇచ్చిన ఫోజు.. అందులోని సీరియెస్ నెస్ కట్టిపడేస్తాయి. తమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి భాగమతి ట్రైలర్‌తో మతి పోగొట్టింది. ఈనెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.