అజ్ఞాతవాసి ఓ ఫ్రెంచ్ సినిమాకి ఫ్రీమేక్ అన్న సంగతి తెలిసిందే. టీ సిరీస్ ఫ్రెంచ్ సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కొంటే… వాళ్లకు చెప్పాపెట్టకుండా త్రివిక్రమ్ ఆ సినిమాని ఎత్తేశాడు. దాంతో రైట్స్ కోసం భారీ మొత్తం చెల్లించి ఈ వివాదం నుంచి బయటపడినట్టైంది. అయితే ఇప్పుడు ‘సాహో’ కూడా అజ్ఞాతవాసి దారిలోనే వెళ్లినట్టు సమాచారం. ప్రభాస్ – సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. ‘లార్గో విన్చ్’ అనే సినిమా ఛాయలు ఈ సినిమాలోనూ కనిపించబోతున్నాయని తెలుస్తోంది. ఎప్పుడైతే ‘అజ్ఞాతవాసి’ వివాదాలకెక్కిందో.. అప్పుడే ‘సాహో’ టీమ్ జాగ్రత్త పడిపోయిందని, ‘లార్గో విచ్చ్’ని పోలిన సన్నివేశాలు, షాట్స్… ఇవేం తమ సినిమాలో లేకుండా జాగ్రత్త పడుతోందని సమాచారం. అంతేకాదు.. ఇది వరకు తెరకెక్కించిన కొన్నివేశాలు అవసరమైతే రీషూట్ చేయాలని భావిస్తోందట ‘సాహో’ టీమ్. టీ సిరీస్ సంస్థ ఇప్పటికే కొన్ని సినిమాలపై దృష్టి సారించిందని, ఒకరిద్దరి లీగల్ నోటీసులు కూడా పంపిందని తెలుస్తోంది. మరి వాళ్లలో `సాహో` ఉందో లేదో!