దొనకొండ పేరెక్కడో విన్నట్టుంది కదా! ఒకప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుందని వూరించిన ప్రాంతం. ప్రకాశం జిల్లాలోని దొనకొండలో రాజధాని వచ్చే అవకాశం వుందని వూహాగానాలు జోరుగా నడిచాయి.వైఎస్ఆర్ పార్టీ నేతలు అక్కడ భారీగా భూములు కొన్నారు గనకే ఆ ప్రచారం వచ్చిందని టిడిపి ఆరోపించింది కూడా. కోస్తా రాయలసీమల మధ్య భాగాన వుంటుంది గనక బాగుంటుందన్న వాదన వుండింది. అమరావతి ఖరారయ్యాక కూడా అక్కడ ఆశలు అట్టిపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తామన్నారు.25 వేల ఎకరాలు గుర్తించారు. అసలైతే 60వేల ఎకరాల ప్రకటించి సగం వరకూ సర్వే చేశారు.2,450 ఎకరాలు ఎపిఐఐసికి దఖలు పర్చారు కూడా. ఒక దశలో చైనా బృందం వచ్చి చూసి వెళ్లింది. ఇక్కడ అభివృద్ది పథకాల ద్వారా వైసీపీ అభిమాన ప్రజలను కూడా దగ్గర చేసుకోవాలనుకున్నారు. ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేశారు గాని మూడేళ్ల అనంతరం కూడా ఎలాటి అడుగూ పడలేదు. భూ సేకరణ విషయంలో రైతులనుంచి సమస్యలున్నాయి గనక అనుకున్నవి చేయలేకపోతున్నామని ఇప్పుడు కాడి పారేశారు. 38 వేల కోట్ల పెట్టుబడులు 75 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి వస్తుందన్న మాటలు ఆవిరైపోయాయని రైతులు విమర్శిస్తున్నారు. సరైనపరిహారం వస్తే భూములు అప్పగించడానికి సిద్ధమైనా ప్రభుత్వం వెనక్కు పోయిందని వారు అంటున్నారట.