“సాక్షి TV” అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఒక ట్వీట్ మరీ విచిత్రమైన లాజిక్ ని తెచ్చింది జనం ముందుకి. జనసేన పార్టీ స్థాపించాక, టిడిపి తో జతకట్టాక, పవన్ కి ఒక్క హిట్టూ రాలేదన్నది స్థూలంగా ఆ ట్వీట్ల సారాంశం. ఇంతకీ ఆ ట్వీట్ ఏమంటుందంటే —
“యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ నాలుగేళ్లలో పవన్ కల్యాణ్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్లే.. గోపాల గోపాల, సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు బయ్యర్లను నిలువునా ముంచేశాయి. పవన్ కల్యాణ్ వరుస చిత్రాలతో ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు కుదేలయ్యారు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్‌కు ఒక్క హిట్ సినిమా పడలేదు. గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, రీమేక్‌ను నమ్ముకుని తీసిన కాటమరాయుడు.. ఈ మూడు సినిమాలు బయ్యర్లకు చుక్కలు చూపించాయి..”
పవన్ కళ్యాణ్ కి ఖుషీ తర్వాత దాదాపు పదేళ్ళు హిట్ లేదు. సినీ ఇండస్ట్రీ లో హిట్లు ఫ్లాపులు మామూలే అయినా పదేళ్ళు హిట్టు లేనప్పటికీ ఫ్యాన్స్ పవన్ వెంటే ఉన్నారు. ఇవన్నీ తెలిసి కూడా, టిడిపి తో జతకట్టాక పవన్ కి ఫ్లాపులే వచ్చాయంటూ “సాక్షి” భాష్యం చెప్పటం వెనుక మర్మమేంటో?
యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ నాలుగేళ్లలో పవన్ కల్యాణ్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్లే.. గోపాల గోపాల, సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు బయ్యర్లను నిలువునా ముంచేశాయి.
— Sakshi TV (@SakshiHDTV) January 10, 2018