జయ జానకి నాయక సినిమాతో మంచి విజయం సాధించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన నెక్ట్స్ సినిమాను కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు శ్రీవాసు దర్శకత్వంలో, పూజా హెగ్డే హీరోయిన్ గా ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే లక్ష్యం, లౌక్యం వంటి చిత్రాలతో సక్సెస్ సాధించిన శ్రీ వాస్… బెల్లంకొండ కొత్త చిత్రానికి ‘సాక్ష్యం’ అనే క్యాచీ టైటిల్ పెట్టారు. ఇప్పుడిక దీని తర్వాతి సినిమాపై దృష్టిపెట్టాడు బెల్లంకొండ.
బుల్లితెర యాంకర్ నుంచి డైరెక్టర్ గా మారి రాజుగారిగది, రాజుగారి గది 2 హిట్స్ కొట్టాడు ఓంకార్.. ఇప్పటి వరకూ హర్రర్, క్యామెడీ జోనర్ లో మూవీలు చేసిన ఓంకార్ తన తదుపరి మూవీని క్రీడా నేపథ్యంతో రూపొందించనున్నాడు. ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో.. ప్రస్తుతం సాక్ష్యం సినిమాతో బిజీగా ఉన్న శ్రీను త్వరలోనే ఈ మూవీని పూర్తి చేసి వెంటనే ఓంకార్ టీంతో కలవనున్నాడు