సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరో గా మారాడు నాని. ‘అష్టాచమ్మా’తో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి నాని.. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ స్టార్. నాని నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల నమ్మకం. ఖచ్చితంగా సినిమాలో విషయం ఉటుందని. తన ఇమేజ్ కి తగ్గ కధలు ఎంచుకుంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నాని.. ఇప్పుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ చేస్తున్నాడు. ఇందులో నానిది డ్యుయల్ రోల్. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ హీరోయిన్స్.
భోగి కానుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో నాని మాస్ లుక్ లో కనిపించాడు. లుంగీ కట్టు, బటన్స్ లేని చొక్కా .. మోడలో తాయిత్తు.. ఇలా మమ మాస్ అనిపించాడు నాని. అయితే ఇది కృష్ణ లుక్. సంక్రాంతి అంటే రేపు అర్జున్ ఫస్ట్‌లుక్‌లను, కనుమరోజు సినిమాలోని ఫస్ట్ సాంగును విడుదల చేయబోతున్నారు. వరుస విజయాలతో వున్న నాని.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్,ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ నుండి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.