https://www.youtube.com/watch?v=qIXwsrwHVB4
పటాస్ సినిమాతో మళ్ళీ కొత్త కళ్యాణ్ రామ్ కనిపించాడు. అయితే వెంటనే వచ్చిన ఇజం సినిమా మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడు మరో హిట్ కోసం రెడీ అయ్యాడు కళ్యాణ్ రామ్. ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీసు ముందుకు రావడానికి సిద్దమౌతున్నాడు. అందులో ఒకటి ‘ఎమ్మెల్యే’. ‘మంచి లక్షణాలు వున్న అబ్బాయి’ అనేది క్యాప్షన్. కాజల్ హీరోయిన్. ఉపేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈరోజు భోగి సందర్భంగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ లో ఫన్ ఎలిమెంట్ పడింది. ”వస్తున్నాడు.. వచ్చేశాడు.. మనందరి ఆశాజ్యోతి…, ఆంధ్రజ్యోతి, ఈనాడు, నమస్తే తెలంగాణ’ అంటూ థర్టీ ఇయర్స్ పృథ్వీ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్ క్యాచిగా వుంది. ఎమ్మెల్యే గెటప్‌లో స్టైల్‌గా కళ్లద్దాలు పెట్టుకోవడం, కండువా వేసుకోవడం.. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలే. అన్నట్టు.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ కూడా చక్కగా డిజైన్ చేశారు. టీజర్ చూస్తుంటే ఇదో పొలిటికల్ సెటైర్ లా అనిపిస్తుంది. మార్చ్ లో క్యాంపెయిన్ మొదలౌతుందని టీజర్ లో రిలీజ్ డేట్ ను కూడా రివిల్ చేశారు. మణిశర్మ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు.