మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రెజీనా. తర్వాత వరుసగా సినిమాలు వచ్చాయి. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయే క్యాలిబర్ రెజీనా సొంతం. వాస్తవం చెప్పాలంటే హీరోకి మించిన ఎనర్జీ కనిపిస్తుంది రెజీనాలో. అయితే ఆమెకు బడా హీరోయిన్ హోదా మాత్రం దక్కలేదు. రవితేజ, గోపి చంద్.. తప్పితే సినియర్ హీరోలతో నటించే ఛాన్స్ రాలేదు. అలాగని ఎన్టీఆర్, చరణ్. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలా సినిమాలు కూడా దక్కలేదు. మీడియం హీరోయిన్ గానే వుంది రెజినా. ఇక ఈ మధ్య సినిమాలు కూడా తగ్గిపోయాయి. 2017లో రెండే సినిమాలు. నక్షిత్రం, బాలకృష్ణుడు. రెండు ఫ్లాఫులే.
అయితే 2018లో మాత్రం తనకు మంచి పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది రెజీనా. ”నాకు 2017 కలసి రాలేదు. కానీ 2018 మాత్రం గొప్ప ఉటుంది ఈ ఏడాది నేను పనిచేసిన కొన్ని చిత్రాలు నాకు కొత్త గుర్తుంపు తెచ్చిపెడతాయి. అందులో ఒకటి నాని నిర్మిస్తున్న అ. ఇందులో నేను డ్రగ్స్ కు బానిసైన అమ్మాయిగా కనిపిస్తా. ఈ పాత్ర కోసం నా జుట్టును అండర్ కట్ కూడా చేసుకున్నా. తప్పుకుండా ఈ సినిమా నాకు ఓ మంచి బ్రేక్ ఇస్తుందని” చెబుతుంది రెజీనా. మరి రెజీనా కలలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.