ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన బ్రాండ్ అంబాసిడర్ల కి ఆ పదవి అచ్చి రావడం లేదా? అవుననే అంటున్నారు కొందరు విశ్లేషకులు. ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్,అజయ్ దేవ్ గన్,కాజల్ పూనమ్ కౌర్, గజల్ శ్రీనివాస్ లను బ్రాండ్ అంబాసిడర్ లు గా ప్రభుత్వం ఆయా సందర్భాలలో ప్రకటించింది.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా సందర్భాలలో నియమించిన బ్రాండ్ అంబాసిడర్లు వీరే:
- అమితాబ్ బచ్చన్ – మెడికల్ అంబాసిడర్
- అజయ్ దేవగన్ ,కాజోల్ – టూరిజం అంబాసిడర్
- పూనమ్ కౌర్- చేనేత బ్రాండ్ అంబాసిడర్
- గజల్ శ్రీనివాస్ – స్వఛ్చ అంద్రప్రదేశ్ అంబాసిడర్
వీరిలో గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లారు.దాంతో ఆయనను ఆ హోదా నుంచి ప్రభుత్వం తప్పించవలసి వచ్చింది. ఇక పూనం కౌర్ ని కత్తి మహేష్ వివాదం లోకి లాగడం తో, ఆమె ని చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించనే లేదని మంత్రి ఒకరు పేర్కొన్నారు. అజయ్ దేవగన్ ,కాజోల్ లు చంద్ర బాబు ని కలిసిన సమయం లో నే, వివాదాలు మొదలయ్యాయి. ఈ మాత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ దొరకలేదా ప్రభుత్వానికి అని కొందరు ప్రశ్నిస్తే, ముఖ్యమంత్రి ముందు అజయ్, కాజోల్ లు కాలి మీద కాలు వేసుకుని కూర్చొన్నారని కొందరు సోషల్ మీడియా లో రచ్చ చేసారు.
ఏది ఏమైనా బ్రాండ్ అంబాసిడర్ గా పదవి ఉన్న వారికి మామూలు గా కంటే కాస్త ఎక్కువ బాధ్యత ఉంటుంది. వారు దానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఏమవుతుందో గజల్ శ్రీనివాస్ ఉదంతం నిరూపించింది. మొత్తానికి ఎపి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయా రంగాల బ్రాండ్ లని ఇనుమడింపజేస్తామని వచ్చిన వాళ్ళు, వారి స్వంత బ్రాండ్ ఇమేజ్ నే నాశనం చేసుకోవడం ఆశ్చర్యకర పరిణామం.