తమిళ స్టార్ సూర్యకి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ వుంది. గజనీతో ఇక్కడ కూడా సంచలనం సృస్టించాడు సూర్య. తర్వాత సింహం సిరిస్ తో ఇక్కడ బీసీ సెంటర్ లో కుడా మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ లో కూడా సూర్యకి మంచి గ్రిప్ వుంది. టోటల్ గా సూర్య సినిమా వస్తుందంటే ఒక టాలీవుడ్ సినిమా రేంజ్ లోనే బజ్ వుటుంది. గజనీ నుండి ప్రతి సినిమాని ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు సూర్య. ఇందులో కొన్ని మంచి విజయాలు సాధించాయి.
తాజాగా గ్యాంగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిందీలో వచ్చిన స్పెషల్ 26కు అఫీషియల్ రీమేక్ ఇది. పండక్కి వచ్చిన ఈ సినిమాకి మంచి రివ్యూలే వచ్చాయి. జై సింహ, అజ్ఞాతవాసి కంటే బెటర్ మార్కులు పడ్డాయి. దీంతో సూర్య మరింత ఎలర్ట్ అయ్యాడు. ఎన్నడూ లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు సూర్య.ఈ క్రమంలో రాజమండ్రిలో ఓ థియేటర్ కు వెళ్లి సందడి చేసిన సూర్య.. అభిమానుల తాకిడి నుండి తప్పించుకోవాడాని ఏకంగా ఆ థియేటర్ వెనుక గెట్ దూకాడు. అది మీడియా కంట కూడ పడింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్. ఏదేమైనా తన సినిమా ప్రమోషన్స్ కోసం సూర్య చూపిస్తున్న శ్రద్దను మెచ్చుకోవాల్సిందే.