మోహన్ బాబు ఇటీవలే 42 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి ఆయన్ని సన్మానించారు. టీఎస్సాఆర్ కాకతీయ లలిత కళా పరిషత్ తరఫున మోహన్ బాబుకు విశ్వ నట సార్వభౌమ బిరుదును ప్రదానం చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది.
500 కి పైగా సినిమాల్లో నటించి త్వరలో “గాయత్రి” సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్న మోహన్ బాబు తొలి సినిమా నుంచే నటన లో రాణించాడు. ప్రత్యేకించి ఆయన “వాచకం” ఆయనకి వరం. అందుకే ఎన్ టీయార్ తర్వాత ఆ స్థాయిలో డైలాగులు చెప్పగలిగేది మోహన్ బాబేనని పలువురు అంటూంటారు. మొత్తానికి ఎన్ టీయార్ “విశ్వ విఖ్యాత నట సార్వభౌమ” అయితే ఇప్పుడు మోహన్ బాబు ‘విశ్వ నట సార్వభౌమ’ అయ్యారు.