దేశం కాని దేశంలో మన భాష మాట్లాడే మనిషి కనిపిస్తేనే ఎంతో సర్ ప్రైజ్ అయిపోతాం. ఇంక మనకు తెలిసిన వ్యక్తి ఎదురుపడితే.. అనందానికి అవధులు వుండవు. అలాంటింది ఆ దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైన చోట మనం అభిమానించే వారి కటౌట్ కనిపిస్తే.. ఇంక ఆ ఫ్యాన్ మూమెంట్ సంబరానికి అంతు వుండదు. ఇలాంటి ఫ్యాన్ మూమెంట్ నే ఎక్స్పీరియన్స్ చేశారు తెలంగాణా మంత్రి కేటీఆర్. ఇంతకీ కేటీఆర్ ను సర్ ప్రైజ్ చేసిన ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా ? అతనే మెగాస్టార్ చిరంజీవి.
ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆశ్చర్యానికి గురయ్యాయ్యే మూమెంట్ చోటుచేసుకుంది. జపాన్లోని షిజ్వోకా ప్రాంతంలోని హమామట్సు అనే పట్టణంలో ఉన్న సుజుకి మ్యూజియంను కేటీఆర్ సందర్శించారు. అయితే ఆ మ్యూజియంలో మెగాస్టార్ చిరంజీవి ఫొటోను చూసి కేటీఆర్ ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయిపోయారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు పోస్ట్ చేశారు. ”సుజుకి మ్యూజియంకు వెళ్ళాను. ఇక్కడ ఎవరి ఫొటో చూశానో ఊహించగలరా? మన మెగాస్టార్ చిరంజీవి. మన మాతృభూమికి చెందిన వారి ఫొటోను హమామట్సు లాంటి చిన్నపట్టణంలో చూడటం గర్వంగా అనిపించింది’ అని ట్వీట్ చేశారుకేటీఆర్.
మెగాస్టార్ చిరంజీవి తన క్రేజ్ ను ఎల్లలు దాటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఒక మంత్రి అయ్యిండి కుడా ఎలాంటి బేషజం లేకుండా మెగా ఫ్యాన్ మూమెంట్ ని కేటీఆర్ అందరితోనూ ఇలా షేర్ చేసుకోవడం ఆకట్టుకుంది.
అన్నట్టు.. కెటీఆర్ , మెగాస్టార్ కు అభిమాని. కేటీఅరే కాదు కవిత కూడా. ఈ విషయాన్ని ఇప్పటికే చాలుసార్లు కెటీఆర్, కవిత. ఇప్పుడీ మెగా మూమెంట్ ని షేర్ చేసి .. మెగాస్టార్ అభిమానుల మనసూ కూడా గెలిచారు కేటీఆర్.
Had a tour of the Suzuki museum at Hamamatsu in Shizuoka prefecture
The tour was great but guess whose picture I get to see there? Our own Mega Star Chiranjeevi Garu ?
Felt nice to see someone from our motherland being recognised in a small town in Japan ? pic.twitter.com/927uGbmYnd
— KTR (@KTRBRS) January 18, 2018