ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఎంవోయులు తద్వారా వచ్చే పెట్టుబడులపై ప్రభుత్వమే అంచనాలు బాగా తగ్గించి చూపింది. ఇప్పటి వరకూ 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోగా లక్షా 27 వేల కోట్లు మాత్రమే ఉత్పత్తి దశకు చేరుకున్నట్టు ప్రభుత్వం కలెక్టర్ల సమావేశంలో తెలియజేసింది. మరో2.25లక్షల కోట్ల మేరకు వివిధ దశల్లో వున్నాయని చెప్పింది.ఈపెట్టుబడుల వల్ల ఇప్పటికి లక్షా ముప్పై వేల ఉద్యోగాలిచ్చినట్టు పేర్కొంది. ప్రభుత్వం వాగ్డానం చేసిన ఉద్యోగాల సంఖ్య 30 లక్షలు కాగా ఇచ్చింది 1.67 లక్షలేనని తేల్చింది. కలెక్టర్ల సమావేశంలో విడుదల చేసిన ఈ రెండు లెక్కలపైనా తీవ్ర సందేహాలేర్పడ్డాయి. ఎందుకంటే లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో వచ్చిన పరిశ్రమలు ఎక్కడ స్థాపించినట్టు? శాఖల వారిగా ఇచ్చిన వివరాలు చూస్తే పరిశ్రమల శాఖ 413 కోట్లమేరకు ఒప్పందాలు చేసుకోగా కేవలం 36 కోట్లు మాత్రమే వచ్చాయని వాస్తవాలు చెబుతున్నాయి.ఇలాంటి తేడాలే ఇంకా చాలా వున్నాయి. ఈ విధమైన అవాస్తవ సమాచారంతో నిరుద్యోగులలో ఆశలు రేకెత్తించే బదులు వున్న విషయమే చెప్పడం మంచిదని పెద్దలంటున్నారు. ఇచ్చిన దాంట్లో కూడా దాదాపు 9000 కోట్ల పెట్టుబడులను రెండు నివేదికలలోచూపించడం వల్ల తొలగించివేశారట. ఇకముందైనా ఇలాటి అంకెలగారడీలు కట్టిపెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.