ఎంత పెద్ద దర్శకుడికైన జయాపజయాలు కామన్. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ లో ఒకరైన త్రివిక్రమ్ కి కూడా ఇప్పుడు అపజయం పలకరించింది. త్రివిక్రమ్ రాసిన తీసినా ఫ్లాఫ్ అనే మాటకు చోటుండదు. యావరేజ్ తోనైనా పాసైపోతుంది. కానీ అజ్ఞాతవాసితో మాత్రం ఆయనకు తొలిసారిగా ఫ్లాఫ్ పరిచయమైయింది. ఇది పెద్ద విషయం కాదు. కానీ ఈ సినిమాపై నెలకొన్న ఓ వివాదాన్ని మాత్రం త్రివిక్రమ్ అభిమానులు జీర్ణంచుకోలేకపోతున్నారు. అదే కాపీ వివాదం. అజ్ఞాతవాసి ప్లాట్ ను త్రివిక్రమ్ .. ‘లార్గో వించ్’ సినిమా నుండి దించారని విడుదలకు ముందు రుమార్స్ వచ్చాయి. విదుదల తర్వాత అవి రూమర్స్ కాదని, నిజమేనని తేలింది.
అజ్ఞాతవాసి చూసిన లార్గో వించ్ డైరక్టర్ జెరోమ్.. ”ప్లాట్ నాదే” అని ఆరోపించాడు. మరో రెండు రోజుల తర్వాత ”టీ సిరిస్ వాళ్ళతో అజ్ఞాతవాసి చేసిన డీల్ సరిపోదు. నేను కేవలం హిందీ రైట్స్ ఇచ్చాను. కానీ అజ్ఞాతవాసి వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. ఆ ఒప్పందం కుదరదు”అని మరో ట్వీట్ పెట్టాడు. ఇంత జరిగుతున్న త్రివిక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో కాపీ అంగీకరించినట్లయింది.
ఇప్పుడీ దర్శకుడు మరిన్ని ట్వీట్లు పెట్టాడు. ;ఇండియన్ సినిమాకు కావాల్సినంత క్రియేటివిటీ వుంది. గ్రంధ చోర్యం చేయాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలై వారం రోజులైనా కాపీ వ్యవహారంపై అజ్ఞాతవాసి యూనిట్ స్పందించలేదు. చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. లీగల్ నోటీసు పంపిస్తా” అంటూ తాజా ఒక ట్వీట్ చేశాడు. దీంతో కాపీ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది.
అసలే అజ్ఞాతవాసి నిరాశ పరిచింది. దీనికి తోడు ఇప్పుడు కాపీ వివాదం. దీంతో పరిస్థితి మరింత డీలాగా మారింది. అయితే ఈ వివాదం మరే సినిమాకి వచ్చింటే పెద్ద సమస్య కాదేమో. కానీ త్రివిక్రమ్ సినిమా కాపీ మరక పడటం ఆయన అభిమానులకే నచ్చడం లేదు. చాలా మంది దర్శకులు హాలీవుడ్ సినిమాలు స్ఫూర్తితో కొన్ని సీన్లు డిజైన్ చేసుకోవడం చూస్తేనే వున్నాం. త్రివిక్రమ్ కూడా గతంలో తన సినిమాల్లో చాలా ఫారిన్ సీన్లు దించారు. అది పెద్ద మేటర్ కాలేదు. కానే ఈసారి ఏకంగా స్టొరీ లైన్ ను వాడుకున్నారు. ఇదే త్రివిక్రమ్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచింది. త్రివిక్రమ్ లాంటి రచయితే ఒక కధ కోసం ఫారిన్ సినిమాపై ఆధారపడటం, ఇంక తన పెన్నులో ఇంక్ అయిపోయినట్లు అదే ప్లాట్ ను వాడుకోవడం షాకింగ్ గా వుంది.
“లార్గో వించ్ గొప్ప కధేం కాదు. ఒక పెద్ద బిజినెస్ మెన్. జీవితంలో ప్రతిది రెండు ఆప్షన్ లుగా ఉంచుకోవడం అలవాటు. అతడిని ఒక ముఠా హతమారుస్తుంది. వారసుడు లేని అతడి సామ్రాజ్యాన్ని దోచుకోవాలని కుట్ర పన్నుతుంది. అయితే అతడి ప్లాన్ బి ఉటుంది. తండ్రికి దూరంగా పెరిగిన కొడుకు మిగతా కధ నడుపుతాడు” ఇది లార్గ్ వించ్ కధ. ఈ మాత్రం లైను త్రివిక్రమ్ కు ఏం నచ్చిందో కానీ అదే లైన్ ను తీసుకొని తనకు నచ్చినట్లు తెలుగీకరించేసి అజ్ఞాతవాసి తీశారు. చివరికి ఇలా వివాదంలో చిక్కుకోవాల్సివచ్చింది.
అసలు త్రివిక్రమ్ లాంటి రచయితకు ఈ ఇంత మాత్రం స్టొరీ తట్టలేదా? అనేది అభిమానుల ప్రశ్న. త్రివిక్రమ్ దర్శకుడిగా కంటే రచయితగా ప్రేక్షకులకు ఇష్టం. ఎవరైనా మంచిగా ఒక డైలాగ్ రాస్తే ”త్రివిక్రమ్ లా రాసున్నాడుర్రా”అని కాంప్లీమెంట్ ఇస్తారు. అంతపెద్ద ట్రెండ్ సెట్ చేసిన రచయిత త్రివిక్రమ్. ”తెలుగు తెరకు మరో జంధ్యాల దొరికాడు” అని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రచయిత త్రివిక్రమ్. నిజంగా త్రివిక్రమ్ వచ్చిన తర్వాత డైలాగ్ నడకే మారిపోయింది. ప్రేమ, పగ, ఆవేశం, కోపం, కరుణ, జాలి.. ఇలా ఏ ఎమోషన్ నైనా వెండితెరపై చూపించడంలో అప్పటికివరకూ వున్న లెక్కలు మార్చేశాడు త్రివిక్రమ్. గుండెలు బాదుకొని చెప్పే డైలాగ్స్ పోయి గుండెలు బరువెక్కించే మాటలతో ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్ళిపోయాడు త్రివిక్రమ్. రాజమౌళి, సుకుమార్, శేఖర్ కమ్ముల,శ్రీనువైట్ల.. లాంటి దర్శకులు.. ”మేము త్రివిక్రమ్ లా రాయలేకపోతున్నామండి”అని ఎలాంటి బేషజం లేకుండా తమ మనసులో త్రివిక్రమ్ పై వున్న ఇష్టాన్ని ప్రదర్శించారంటే.. అర్ధం చేసుకోవచ్చు త్రివిక్రమ్ గొప్పదనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన రచన గురించి చెప్పడానికి ఆయన స్థాయి మాటలే కావాలి.
త్రివిక్రమ్ లో మరో యాంగిల్ కూడా వుంది. తెలుగు సాహిత్యాన్ని నమిలిమింగేసిన వ్యక్తుల్లో త్రివిక్రమ్ ఒకరు. కావ్యాలు,కధ, నవల, పద్యం, గద్యం, కవిత.. ఇలా ఏది కదిపినా.. వాటిపై ప్రవచనాలు చెప్పెయగల చదువరి త్రివిక్రమ్. తెలుగనే కాదు ఇంగ్లీష్ లిటరేచర్ పై కూడా ఆయనకు మంచి గ్రిప్. ఏదైనా నవల చదినా, కధ చదివినా.. దానిపై డీప్ ఎనాలసిసి ఇవ్వగల సామర్ధ్యం వున్న వ్యక్తి. మరి ఇంతటి మేధా సంపత్తి కగిలిన త్రివిక్రమే ఇలా కాపీ రచయిత వివాదంలోకి రావడం ఆయన అభిమానులకు ఎదోలా వుంది.
అసలు త్రివిక్రమ్ లాంటి రచయిత తెలుగు చిత్ర పరిశ్రమలలో వుండటం గర్వంగా ఫీలౌతారు కొందరు. హాలీవుడ్ సినిమాలను మనోళ్ళు కాపీ చేసుకుంటారు అనే అపవాదు ఎప్పటి నుండో వుంది. అయితే ఫారిన్ వాళ్ళు కొనుక్కునే సత్తా వున్న కధను తయారుచేయగల రచయిత త్రివిక్రమ్ అని చాలా మంది విశ్వాసం. నిజమే.. త్రివిక్రమ్ లాంటి రైటర్ కే అది సాధ్యపడుతుంది కూడా. కానీ అలాంటి త్రివిక్రమే ఇలా కాపీ వివాదంలోకి రావడం అభిమానుల నమ్మకంపై దెబ్బకొట్టినట్లయింది.