సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఎట్టకేలకు దిగి వచ్చారు. బిజెపి అద్యక్షుడు అమిత్ షాతో ముడిపడివున్న జస్టిస్ లోయా మృతి కేసు విచారణ తనే చేపట్టనున్నట్టు అధికార పత్రాల ద్వారా వెల్లడించారు. సీనియర్లమైన తమను కాదని ఈ కేసును అరుణ్ మిశ్రాకు అప్పగించడం జస్టిస్ చలమేశ్వర్ తదితరుల తిరుగుబాటుకు తక్షణ కారణం. వారి విమర్శలపై అరుణ్ మిశ్రా తీవ్ర మనస్తాపానికి గురైనట్టు చెబుతున్నారు. 12వ తేదీన వారు మీడియాతో మాట్లాడితే 16వ తేదీన ఆయన ఇతర జడ్జిలతో కలసి ఈ కేసు చేపట్టారు. సరైన బెంచి ముందు వుంచవలసిందిగా ఆదేశాలిచ్చి విచారణ ముగించారు. తాజాగా విడుదలైన సుప్రీం కోర్టు కేసుల లిస్టింగ్‌లో లోయా కేసును సిజె దీపక్ మిశ్రా, ఖాన్వలియా, చంద్రచూడ్‌లు విచారిస్తారని వుంది. అంటే పాత బెంచి కొనసాగదని అర్థమైపోయింది. ఇక ఇతర సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.