ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ల మధ్య ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ ముగ్గురు ఇప్పుడు ఓ రేస్ లో ఉన్నారు. అదే ట్విట్టర్ రేస్. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో అత్యంత ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉన్న ఇండియన్స్ లో ఈ ముగ్గురే టాప్.
నిన్నటి వరకు ధర్డ్ ప్లేస్ లో ఉన్న మోడీ సడన్ గా షారూఖ్ ని క్రాస్ చేసి సెకండ్ ప్లేస్ కి వచ్చాడు. ట్విట్టర్ లెక్కల ప్రకారం మోడీకి 1,73,82,784 మంది ఫాలోయర్స్ ఉన్నారు. షారూఖ్ ని 1,73,62,505 మంది ఫాలో అవుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న మోడీ ఫాలోయింగ్ ని షారూఖ్ ని బీట్ చేశాడు మోడీ. ప్రతి రెండు నెలలకి కనీసం 10లక్షల మంది ఫాలోయర్స్ మోడికి యాడ్ అవుతుండటంతో ప్రస్తుతం ఫాలోవర్స్ సంఖ్య ఆ విధంగా ఉంది. దీంతో త్వరలో నంబర్ వన్ గా నిలిచినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.
అమితాబ్ బచ్చన్ కి ట్విట్టర్ లో 1,88,81,211 మంది ఫాలోయర్స ఉన్నారు. అంటే సీనియర్ బచ్చన్ ని బీట్ చేయాలంటే.. మోడీకి మరో 15లక్షల మంది ఫాలోయర్స్ యాడ్ అవ్వాలి. అప్పుడు ఇండియాలో ట్విట్టర్ ఫాలోయర్స్ లో టాపర్ ఇన్ ద బ్యాచ్ గా నిలుస్తాడు మోడీ. ఇక పొలిటికల్ గా చూసుకుంటే.. కూడా మోడీ కి మాంచి ఫాలోయింగ్ ఉంది. ట్విటర్ లో అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న లీడర్ మనోడే. ఒబామాని 6,85,54,592 ఫాలో అవుతుండటం విశేషం.