మొత్తానికి మరోసారి సంక్రాంతి హీరోగా నిలిచాడు నందమూరి బాలకృష్ణ. పవన్ సినిమా ‘అజ్ఞాతవాసి’ అట్టర్ ఫ్లాప్ అవ్వడం, మిగిలిన సినిమాలు ఏమాత్రం పోటీ ఇవ్వకపోవడం వల్ల.. ‘జై సింహా’ నింపాదిగా హిట్టు కొట్టేసింది. ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్లో చేరినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లో ఆత్మీయ సభని కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ”నా సినిమాలు చాలా రికార్డులు బద్దలు కొట్టాయి. చాలా హిట్టయ్యాయి. అయితే నేనెప్పుడూ వాటి గురించి పట్టించుకోను. మంచి సినిమా తీయాలి, తద్వారా సినీ పరిశ్రమ బాగుండాలన్నదే నా ఆశ. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. అది దైవాదీనాలు. ఓ విజయం వస్తే పొంగిపోవడం, పరాజయం పాలైతే కృంగిపోవడం ఇవి రెండూ ఉండవు. సినిమాని సినిమాగానే చూస్తా. జై సింహా విజయం మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయంతో అందరి కళ్లలో ఆనందాన్ని చూశా” అన్నాడు బాలయ్య. అన్నట్టు ఈరోజు.. ఎన్టీఆర్సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయట. నందమూరి బాలకృష్ణ ఇంట్లో లాంఛనంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్‌కి సంబంధించిన పూజ జరిగిందని తెలుస్తోంది.