ఈ వారం సోలోగా వచ్చేస్తోంది `భాగమతి`. అనుష్క సినిమా… పైగా యూవీ క్రియేషన్స్ నుంచి వస్తోంది.. కాబట్టి తప్పకుండా అంచనాలుంటాయి. సినిమా ఎలాగున్నా.. ఓపెనింగ్స్ రావడం ఖాయం. అయితే.. స్వీటీ కెరీర్‌కి ఈ సినిమా చాలా కీలకం. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. దాదాపుగా యూవీ క్రియేషన్సే అన్ని చోట్లా సొంతంగా విడుదల చేసుకుంటోంది. పెట్టుబడి మొత్తాన్ని తిరిగి తీసుకుని రావడం పెద్ద మేటరేం కాదు. సినిమా బాగుంది అని తెలిస్తే చాలు. కాకపోతే.. సోలో హీరోయిన్గా అనుష్క ఏమంత ఫామ్‌లో లేదు. సైజ్ జీరో ఫ్లాప్ అయ్యింది. రుద్రమదేవి కూడా అంతంత మాత్రమే. వర్ణ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. కమర్షియల్ సినిమాల్లో అనుష్క కనిపిస్తే ఓకే. కానీ ఈ సినిమా అలా కాదు. కేవలం తన ఇమేజ్‌పై ఆధారపడి నడిచే కథలు ఇవి. లేడీ ఓరియెంటెడ్ సినిమాల క్రేజ్ అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. పైగా ఈ స్థాయి బడ్జెట్లు పెట్టడానికి నిర్మాతలెవరూ సిద్దంగా లేరు.
`భాగమతి` హిట్టయితే.. నిర్మాతల ఆలోచనల్లో మార్పులు రావొచ్చు. ఫలితంలో తేడా వస్తే మాత్రం అనుష్క కెరీర్‌కే కాదు… లేడీ ఓరియెంటెడ్ కథలకే చమరగీతం పాడాల్సివస్తుంది. మరోవైపు అనుష్క ఈ సినిమా ఫలితం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాతో తన ప్రయాణం ఏవిధంగా సాగాలన్నది నిర్ణయించుకుంటుంది. పాజిటీవ్ రిలజ్ట్ వస్తే సరేసరి… లేదంటే ఇక మీదట నాయికా ప్రాధాన్యం ఉన్న కథలవైపు అనుష్క మొగ్గు చూపింకచపోవొచ్చు.