అనసూయకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. ‘జబర్దస్త్’ సాక్షిగా హాట్ యాంకర్ అందాలను ఆస్వాదిస్తున్న వీక్షకులందరికీ ఇవి తెల్సిన విషయాలే. పెళ్లయిన హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతున్నాయేమో కానీ, అనసూయకు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ, సినిమాల్లో మాత్రం తనను ‘మిస్’గా ప్రాజెక్ట్ చేసుకోవాలని అనసూయ అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. మోహన్ బాబు ‘గాయత్రి’లో అనసూయ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ శ్రేష్ఠ జయరాంగా కనిపించనున్నారు. మంగళవారం సినిమాలో ఆమె లుక్ రిలీజ్ చేశారు. అందులో శ్రేష్ఠ జయరాం పేరుకి ముందు ‘మిస్’ అనేదాన్ని బాగా ప్రాజెక్ట్ చేశారు. అంతకు ముందు సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’లో స్పెషల్ సాంగ్ చేసినా… ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జున సరసన కనిపించినా… పెళ్లి కాని అమ్మాయి పాత్రలే. కావాలనే ఇలాంటి పాత్రలను అనసూయ సెలెక్ట్ చేసుకుంటుందా? పెళ్లి కాని అమ్మాయి క్యారెక్టర్లు చేస్తే ఎక్కువకాలం ఇండస్ట్రీలో బండి లాగించొచ్చని అనుకుంటుందా? రామ్ చరణ్ – సుకుమార్ ‘రంగస్థలం’ చూస్తే కొంచెం క్లారిటీ రావొచ్చు.