‘ఇక సినిమాలు లేవు. రాజకీయాలే. రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తా’ – హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేటెస్ట్ స్టేట్మెంట్. సినిమాలు చేయాలా? వద్దా? అనేది పవన్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని తప్పుబట్టడానికి, విమర్శించడానికి ఎవరికీ అధికారం లేదు. కానీ, హీరోగా చేస్తాడని ఆయనకి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతల పరిస్థితి ఏంటి? ఆయన కోసం వెయిట్ చేస్తున్న దర్శకుల పరిస్థితి ఏంటి? ఇక్కడ క్వశ్చన్!
పవన్‌కు అడ్వాన్సులు ఇచ్చింది ఎవరెవరు?
నెంబర్ 1: ఏయం రత్నం
పవన్‌కి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతల్లో ప్రముఖంగా చెప్పుకోవలసింది ఏయం రత్నం గురించి. పవన్‌తో ‘ఖుషి’ వంటి సూపర్ హిట్, తర్వాత ‘బంగారం’ తీశారు. రెండో సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. 2008 తర్వాత ఐదేళ్లు నిర్మాణానికి దూరంగా ఉన్న ఏయం రత్నం, తమిళంలో అజిత్ ‘ఆరంభం’తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. అజిత్ తో మూడు హిట్స్ కొట్టారు. తెలుగుతో పవన్ కళ్యాణ్ సినిమాతో మళ్ళీ భారీ సినిమాలు తీయడం ప్రారంభించాలని అనుకుంటున్నారు. తమిళంతో ‘జిల్లా’ వంటి కమర్షియల్ హిట్ తీసిన ఆర్.టి. నేసన్ కథతో రెడీ. ‘జిల్లా’ తర్వాత ఈ దర్శకుడు మరో సినిమా తీయలేదు. పవన్ ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు పవన్ వాళ్లకు అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తే సరిపోతుందా? వాళ్ళ టైమ్ మళ్ళీ తిరిగొస్తుందా?
నెంబర్ 2: నిర్మాతలు జె. భగవాన్ రావు, జె. పుల్లారావు
శ్రీ బాలాజీ సినీ మీడియా అధినేతలు జె. భగవాన్ రావు, జె. పుల్లారావులు పవన్‌కు అడ్వాన్సు ఇచ్చి మూడు నాలుగేళ్లు అవుతుందట. ఇన్నాళ్లు పవన్ సినిమా చేస్తాడని వెయిట్ చేశారు. ఇప్పుడు వీళ్లు ఏం చేస్తారో?
నెంబర్ 3: మైత్రీ మూవీ మేకర్స్
మహేష్ బాబు ‘శ్రీమంతుడు’, జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’లతో సూపర్ హిట్స్ కొట్టి, ప్రస్తుతం రామ్ చరణ్ ‘రంగస్థలం’ నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సైతం పవన్‌కి అడ్వాన్సు ఇచ్చారు. ‘కందిరీగ’, ‘రభస’ సినిమాల ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళ సంగతి ఏంటో?
మరో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు సైతం పవన్‌కి అడ్వాన్సులు ఇచ్చారని తెలుస్తోంది. రాజకీయాల్లో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళదామనుకుంటున్న పవన్ సినిమా నిర్మాతలు, దర్శకుల విషయంలో ఎందుకు ముందుచూపుతో వ్యవహరించలేదో!?