రాంగోపాల్ వర్మలోని దర్శకుడు.. మెల్లమెల్లగా మరుగున పడిపోయి.. వ్యాపార వేత్త బయటకు రావడం ఆయన అభిమానులు గమనిస్తూనే ఉన్నారు. సినిమాల్ని చుట్టేయడం, హైప్ పెంచి – లాభాల్ని దక్కించుకోవడం, ధనార్జనే ప్రధాన ధ్యేయంగా సినిమాల్ని రూపొందించడం ఇవన్నీ అందుకు సాక్ష్యాలు. తాజాగా `జిఎస్టీ` పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించాడు వర్మ. గాడ్ సెక్స్ ట్రూత్… అనగానే మనోడు ఏం చెప్పదలచుకున్నాడో అర్థమైపోయింది. ఓ పోర్న్ స్టార్‌ని తీసుకొచ్చి… ఫొటో షూట్లు చేసి, వాటిని నిరభ్యంతరంగా షేర్ చేసుకుంటూ, వివాదాలు రేపుతూ.. ఈ వీడియోపై ఆసక్తిని పెంచాడు వర్మ. సదరు శృంగార ప్రియులంతా…. ఈ వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా.. `ఫ్రీ`గా చూసేద్దామా అని ఎదురుచూశారు. అయితే అలాంటి వాళ్లందరికీ వర్మ షాక్ ఇచ్చాడు. ఈ వీడియో ఫ్రీగా చూడ్డానికి అస్సలు కుదరదు. రూ.150లు చెల్లించి చూడాలి. అదీ ఒక్కసారికే.
ఇప్పటికే యువతరం వర్మ బూతు భాగోతాన్ని ఎంత రసవత్తరంగా తీశాడా అని ఎదురు చూస్తున్నారు. వర్మని విమర్శించాలనుకున్నవాళ్లు, పని గట్టుకొని పొగడాలనుకున్నవాళ్లూ… ఈ వీడియోని రూ.150 పెట్టి మరీ చూసి తరించాల్సిందే. అంటే… క్లిక్కులతో పాటు పైకం రావడం ఖాయం. అలా జరిగితే వర్మ ఎత్తుగడ ఫలించినట్టే. ఓ స్టార్ హొటల్లో, తన దగ్గరున్న కెమెరాలతో.. ఎంత రిచ్‌గా తీసినా… రూ.10 లక్షల్లో పూర్తయిపోతుంది ఈ వీడియో. ఆ మాత్రం సొమ్ము రాబట్టుకోవడం చాలా ఈజీ. ఆ మాటకొస్తే….ఆ పదికి ఎన్నిరెట్లు లాభం వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వర్మ ప్లాన్ వర్కవుట్ అయితే…. ఇక సినిమాలు మానేసి బేషుగ్గా, బేషరంగా ఇలాంటి హాట్ వీడియోలు తీసుకుంటూ కాలం గడిపేస్తాడు. ఎవరెన్ని విధాలుగా నవ్విపోయినా.. ఆయనకేటి సిగ్గు… అక్కడున్నది వర్మ మరి!