రాం గోపాల్ వర్మ- మొండిఘటం లాంటి డైరెక్టర్. తనకి నచ్చింది తాను చేయడం తప్ప ఎవ్వరి మాటా వినే రకం కాదు. అయితే ప్రస్తుతం నాగార్జున తో ఒక సినిమా చేస్తున్నాడు. నాగార్జున, ఈ సినిమా మొదలవక ముందు ఒక మాట చెప్పాడు. ఆర్జీవి తో ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగ్ సినిమా ఎలా ఒప్పుకున్నాడో అన్న డౌట్ ఉన్నవాళ్ళ కోసం ఆ మాట చెప్పినట్టున్నాడు. కానీ ఇప్పుడూ వర్మ తీరు చూస్తుంటే నాగ్ సలహాని ఆయన బేఖాతరు చేసినట్టే అనిపిస్తోంది.
నాగ్ మాట్లాడుతూ,- ఈ మధ్య కాలం లో వర్మ ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఎక్కువ ప్రాజెక్టులు ఒకేసారి చేయడం వల్ల ఫోకస్ లేక ఫ్లాపులు తీసాడని, తన సినిమా విషయంలో అందుకే ఒక షరతు పెట్టి, దానికి వర్మ ఒప్పుకున్నాకే సినిమా ఒప్పుకున్నానని చెప్పాడు నాగ్. ఇంతకీ తన షరతు ఏంటంటే – ఇలా ఎక్కువ ప్రాజెక్టులు చేయకుండా కేవలం తన ప్రాజెక్టు మీదే ఉండేట్లయితేనే సినిమా చేస్తానని షరతు పెట్టానని, అందుకు ఓకే అన్నాకే వర్మతో సినిమా ఒప్పుకున్నానని అన్నాడు నాగ్. వర్మ సమక్షం లోనే ఈ వ్యాఖ్యలు చేసాడు నాగ్. కానీ ఇప్పుడు వర్మ తీరు చూస్తూంటే నాగ్ కి ఇచ్చిన మాటని ప్రక్కన పెట్టినట్టే కనిపిస్తోంది. నాగ్ సినిమా మొదలెట్టాకే, కడప సిరీస్ విషయం తోనో జీఎస్టీ తోనో కాంట్రవర్సీలు చేస్తున్నాడు వర్మ. నాగ్ ప్రాజెక్ట్ తప్ప మిగతా అన్ని విషయాల మీదా టివిల్లో కనిపిస్తున్నాడు వర్మ.
నాగ్ షరతు ని ప్రక్కనపెట్టేసిన వర్మ సినిమా ఎలా తీస్తాడో అని నాగ్ అభిమానులు కంగారుపడుతుంటే, మొదలెట్టాక ఇక చేసేదేమీ లేక కంటిన్యూ చేస్తున్నట్టున్నాడు నాగ్.