లావణ్య త్రిపాఠిది ముందు నుంచీ ఎగుడుదిగుడల కెరీరే. ఓ హిట్టు కొట్టిందంటే.. మరో రెండు మూడు ఫ్లాపులు వరుస కట్టేస్తాయి. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన .. ఇలా వరుస హిట్లు కొట్టి ఓ దశలో రేసులోకి వచ్చింది. అయితే.. శ్రీరస్తు – శుభమస్తు తరవాత అన్నీ ఫ్లాపులే. లక్ష్మీదేవికి ఓ లెక్కుంది, మిస్టర్, రాధ, యుద్దం శరణం.. ఇలా ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టింది. ఉన్నది ఒకటే జిందగీ ఓ మాదిరిగా ఆడింది. అందులోనూ లావణ్య చేసిందేం లేదు. ఇప్పుడు తన చేతుల్లో ఉన్న ఒకే ఒక్క సినిమా ఇంటిలిజెంట్. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించాడు. వినాయక్ దర్శకుడు. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమాపైనే లావణ్య ఆశలన్నీ పెట్టుకుంది. ఇదే చివరి ఛాన్స్ అని తనకూ తెలుసు.. అందుకే… ఇందులో గ్లామర్ డోసు పెంచిందట. స్టెప్పులు కూడా సాయిధరమ్ తో పోటీ పడి వేసిందని టాక్. హిట్టు కొడితే.. ఓకే. లేదంటే… లావణ్య కెరీర్ చమరాంకానికి చేరినట్టే. ”వినాయక్ లాంటి పెద్ద దర్శకుడితో పనిచేయడం నిజంగా నా అదృష్టమే. ఈ సినిమాతో నాకు మళ్లీ అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతున్నా” అంటోంది లావణ్య.