ఎంతోమంది యాక్టింగ్ ఛాన్సుల కోసం స్టూడియోలు, సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ‘ఖడ్గం’ సినిమాలో దర్శకుడు కృష్ణవంశీ చెప్పినట్టు ‘ఒక్క ఛాన్స్’ అంటూ! ఇక్కడ సీన్ రివర్స్. మా సినిమాలో హీరోగా చేయమంటూ దర్శక-నిర్మాతలు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ చుట్టూ చక్కర్లు కొడుతుంటే ‘నో’ చెప్పాడట. ముంబయ్ నుంచి హైదరాబాద్ ల్యాండ్ అవుతున్న విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల కంటే రవీందర్ కటౌట్, పేస్ కట్ బాగుంటాయి. మంచి హ్యాండ్సమ్ హంక్ కూడా! ప్రతిరోజూ సినిమా ఇండస్ట్రీలో జనాలకు ఎక్కడోచోట కనిపిస్తారు. ఇక ఎందుకు వదిలిపెడతారు చెప్పండి! తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న దర్శక నిర్మాతలు హీరోగా చేయమని వెంట పడ్డారట. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా రవీందర్ ‘యస్’ మాత్రం చెప్పలేదు. ఎప్పుడూ ‘నో’ అనే ఆన్సర్ చెప్పాడట. దాంతో వాళ్ళూ విసిగిపోయి వదిలేశారు. ఇదంతా ‘భాగమతి’ విడుదల సందర్భంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన సమయంలో రవీందరే స్వయంగా చెప్పారు. మీడియా జనాలు ఆఫ్ ది రికార్డుగా ఎంత అడిగినా ఆ తమిళ సినిమా ఏదో చెప్పలేదట!