మహేష్ బాబు అక్క మంజుల మెగాఫోన్ పట్టుకుని తీసిన మొట్టమొదటి సినిమా ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమాలో అమైరా దస్తూర్, త్రిధా చౌదరి హీరోయిన్లు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… త్రిదా చౌదరి చేసిన పాత్రకు ముందు అమైరాను కాంటాక్ట్ చేశారు. కథ, అందులో క్యారెక్టర్ గురించి అమైరాకు మంజుల ఫుల్లుగా చెప్పారు. కథంతా విని నా మనసుకు ఈ క్యారెక్టర్ నచ్చలేదని అమైరా చెప్పేసింది. బికినీ వేసుకోవాలనో (ఆల్రెడీ ట్రైలర్లో త్రిధా బికినీలో కనిపిస్తుంది. ‘మనసుకు నచ్చింది’లో నేను బికినీ వేసుకున్నానని చెప్పుకుంది కూడా)… సెకండ్ హీరోయిన్ రోల్ అనో… అమైరా నో చెప్పేసింది. కట్ చేస్తే… మంజుల నుంచి అమైరాకు మళ్ళీ కాల్ వెళ్ళింది. ఈసారి మెయిన్ హీరోయిన్ రోల్ ఆఫర్ చేశారు. నీ రియల్ లైఫ్ పర్సనాలిటీకి ఈ క్యారెక్టర్ దగ్గరగా ఉంటుందని చెప్పగానే ఒప్పేసుకుంది అమైరా. మంజుల చెప్పిన మాట నచ్చిందో… మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ నచ్చిందో… మొత్తానికి సినిమా చేసింది. ఫిబ్రవరి 16న ఈ సినిమా విడుదల కానుంది.