మహేష్‌బాబు ప్రమాణ స్వీకారం చేశారు… గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేశారు. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా కోసం! గురువారం సాయంత్రం కొరటాల శివ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో చిత్రకథ గురించి కొంత క్లారిటీ ఇచ్చారు. “డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థలో మహేష్‌బాబుగారు హీరోగా నేను దర్శకత్వం వహిస్తున్న సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని చాలామందికి తెలుసు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే… ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఒక కల్పిత రాజకీయ కథ” – కొరటాల శివ మాటల్లోని సారాంశమిది. ఈ రోజు ఉదయం విడుదల చేసిన ‘ఫస్ట్ ఓథ్’ ద్వారా సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారని, ఆయన పేరు భరత్ అని క్లారిటీ వచ్చేసింది. సినిమా టైటిల్ మాత్రమే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆల్రెడీ మహేష్ ‘భరత్ అనే నేను’ అని ప్రమాణ స్వీకారం చేశారు. సినిమా టైటిల్ అదేనంటూ ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. మరో మంచి చూసుకుని టైటిల్ అనౌన్స్ చేస్తారేమో!