హీరో నాని ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయనతో పాటు, డ్రైవర్ ఎలాంటి గాయాలూ కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నాని, అతని డ్రైవర్ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ మీదుగా గచ్చిబౌలి వైపు వెల్తుండగా.. ప్రోస్టు పబ్ సమీపంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ మీదకెక్కి డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. కారు బెలూన్లు తెరచుకోవడంతో నాని, అతని డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద విషయాన్ని నాని తన కుటుంబ సభ్యులకు తెలిపి మరో కారులో వెళ్లిపోయారు. అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ఈ ప్రమాదానికి గల కారణమని తెలుస్తుంది.