జబర్దస్త్ యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదుంచుకుంది అనసూయ. తర్వాత నటిగా కూడా ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఐతే ఈ క్రమంలో ఆమె పై కొందరు విమర్శల, వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరం. ఇదివరకే తన వ్యక్తిగత జీవితంపై కొందరు చేస్తున్న కామెంట్స్ కు సోషల్ మీడియా వేదికగా స్పదించిన అనసూయ మరోసారి తనపై జరుగుతున్న ఈ దాడిని వివరించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది అనసూయ.
డియర్ ఇండియా.. ఒక పరిపూర్ణమైన మహిళగా నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను. నేను చేసే పని, ధరించే దుస్తులు నా ఫామిలీకి ఏ విధంగానూ ఇబ్బంది కల్గించడం లేదు. కానీ ఇతరులు మాత్రం చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని కొందరు నన్నే కాదు, నా భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబాన్ని దూషిస్తున్నారు. ప్రతిరోజూ నాకు వచ్చే ఫోన్ కాల్స్, కామెంట్స్ తో మనశ్శాంతి లేదు. బాధ్యత కలిగిన ఓ మహిళగా, రిపబ్లిక్ డే నాడు నేను ప్రశ్నిస్తున్నాను. స్వేచ్ఛకు అర్థం ఇదా? నేను కోరుకున్న పనిని చేసుకునే స్వేచ్ఛ నాకు లేదా? దీనికి పరిష్కారం లేదా ? అంటూ యావత్ సమాజాన్ని ప్రశ్నించింది అనసూయా.
ఈ పోస్ట్ కు మాత్రం నెటిజన్లు చాలా పాజిటివ్ గా స్పదించారు. ”భయపడకు అనసూయ మీ వెంట మేమున్నాం” అంటూ సందేశాలు ఇచ్చారు.