https://www.youtube.com/watch?v=K43QnikUWPU
‘భరత్ అనే నేను’ ఫస్ట్ ఓథ్, టైటిల్, సినిమాలో మహేష్‌బాబు లుక్ ఈ రోజు విడుదల చేశారు. రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా కనుక రిపబ్లిక్ డే రోజున ఇవన్నీ రిలీజ్ చేయడం మంచి ఐడియా. ఆడియన్స్, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్, ‘భరత్ అనే నేను’ మేకర్స్ సినిమాలో ఏం హైలైట్ చేయాలనుకున్నారో? ఏం హైలైట్ అవుతుందని అనుకున్నారో? తెలీదు గానీ… ఒక్కటి మాత్రం బాగా హైలైట్ అయ్యింది. అదే మహేష్‌బాబు వాయిస్.
‘భరత్ అనే నేను’లో మహేష్‌బాబు సీయంగా చేస్తున్నాడని, ఇందులో అతడి పేరు భరత్ అని, టైటిల్ ఇదేనని ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్నాయి. అందువల్ల, అవేవీ ప్రేక్షకులకు కిక్ ఇచ్చినట్టు లేవు. పెద్దగా బజ్ కూడా తీసుకురాలేదు. డిస్కషన్ జరగలేదు. మహేష్‌బాబు వాయిస్ మీద మాత్రం భీభత్సమైన డిస్కషన్ జరుగుతోంది. మహేష్ వాయిస్ అచ్చం వాళ్ల నాన్న కృష్ణ వాయిస్, డైలాగ్ డెలివరీని గుర్తు చేస్తుందని చాలామంది అంటున్నారు. మీకు కూడా సేమ్ టు సేమ్ అలా అనిపిస్తుందా? లేదా? కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలపండి.