తన తల్లి బసవ రామ తారకం పేరు మీద బాల కృష్ణ హైదరాబాద్ లో “బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పటల్, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్” నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 18 యేళ్ళుగా ఈ ఆస్పత్రి నిర్వహిస్తూ పలువురికి చికిత్సలందిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడూ ఈ ఆస్పత్రి ని హైదరాబాద్ తో పాటు ఎపిలోనూ విస్తరించడానికి బాల కృష్ణ ప్రణాళికలు రచిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే బాల కృష్ణ బసవ తారకం కేన్సర్ ఆస్పత్రిలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉన్నది నలుగురికు పంచాలన్న ఉద్దేశంతోనే కేన్సర్ వ్యాధిగ్రస్తులకు సహాయం చేసేందుకు బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి రిసెర్చ్ సెంటర్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్లోని తుళ్లూరు ప్రాంతంలోనూ బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్టు బాలకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం 15ఎకరాల భూమిని కేటాయించిందని కూడా తెలిపారు.