”సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత ఏం సంపాదించానో తెలియదు కానీ మంచి కుటుంబాలను స్నేహితులుగా పొందాను. ప్రభాస్, రాజమౌళి కుటుంబం సభ్యులు నన్ను తమ ఇంటి అమ్మాయిగా చూసుకుంటారు. నేను వాళ్ళ కుటుంబంలో అమ్మాయినే” అని చెబుతుంటుంది అనుష్క. అవును.. ప్రభాస్.. రాజమౌళిల ఫ్యామిలీస్ తో అనుష్కకి మంచి స్నేహం వుంది. ప్రభాస్, అనుష్క లు హీరో హీరోయిన్స్ గానే కాకుండా అఫ్ స్క్రీన్ మంచి స్నేహితులు కూడా. ఇక రాజమౌళి ఐతే అనుష్కను ”స్వీటు” అని ముద్దుగా పిలుచుకుంటారు. ”అనుష్క లేకపోతె దేవసేన లేదు. దేవసేన లేకపోతే నా బాహుబలి లేదు” అని అనుష్కపై తనకున్న అభిమానాన్ని చాటారు రాజమౌళి. ఇక అనుష్క నుండి ఏ సినిమా వచ్చినా అభినందించడాని సిద్దంగా వుంటారు ప్రభాస్, రాజమౌళి. అలాంటింది ఇపుడు భాగమతిని మాత్రం మర్చిపోయారనిపిస్తుంది.
ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకువచ్చింది భాగమతి. సినిమాకి మంచి అప్లాజ్ వచ్చింది. 2018కి తొలి హిట్ అని చెప్తున్నారు. అంతా బావుంది కానీ.. అసలు ఈ సినిమాపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు ప్రభాస్, రాజమౌళి. బేసిగ్గా మంచి టాక్ వచ్చిన చాలా సినిమాలకి తన వంతుగా మాట సాయం చేయాలని చూస్తుంటారు రాజమౌళి. అలాంటిది తన దేవసేన సినిమాపై మాత్రం కనీసం పేస్ బుక్ లోనైనా స్పదించలేదు రాజమౌళి. పోనీ రాజమౌళి ఎదో బిజీతో మర్చిపోయారు అనుకుందాం. అసలు ప్రభాస్ ఈ సినిమా పై ఒక్క ట్వీట్ కానీ పోస్ట్ కానీ పెట్టకపోవడం ఏమిటో అర్ధం కాదు. యువీ అంటే ప్రభాస్ హోం బ్యానర్. అనుష్క స్నేహితురాలు. అలాంటింది ఆ సినిమాపై కనీసం స్పదించలేదు. ఇప్పటివరకైతే ఇటు ప్రభాస్ కానీ అటు రాజమౌళి కానీ భాగమతిపై ఒక్క మాట చెప్పలేదు. పేస్ బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ ఆ దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం సినిమా అయితే మంచి బజ్ లో నడుస్తుంది. మరి వేడి తగ్గిన తర్వాత మళ్ళీ ఊపు తీసుకురావడానికి వారి స్పందనలు సేవ్ చేశారేమో చూడాలి.