2018 బిగినింగ్ టాలీవుడ్ కి పెద్దగా కలసి రాలేదు. ఎన్నో అంచనాలు ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతంలో కలసిపోయింది. బాలకృష్ణ జైసింహ పరిస్థితి కూడా ఇంతే. సంక్రాంతికి హిట్ కొడతాడని భావించిన బాలయ్య కూడా చేతులెత్తేశాడు. అయితే అనుష్క మాత్రం ‘హిట్’ అనే మాటను వినిపించింది. భాగమతిగా బోణి కొట్టింది. రిపబ్లిక్ డే కానుకగా వచ్చినీ సినిమాకి మంచి అప్లాజ్ వచ్చింది. ఒక్క బ్యాడ్ రివ్యూ కూడా రాలేదు. అందరూ మంచి మార్కులు వేశారు. సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్ బాగానే చేసింది యువీ. అయితే ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత పోస్ట్ ప్రమోషన్ కూడా చాలా ముఖ్యం. కానీ భాగమతి విషయంలో ఆ శ్రద్ద కనిపించడం లేదు. బహుసా సినిమాకి హిట్ టాక్ వచ్చిందన్న ధీమాతో ఏమో కానీ.. ఈ సినిమా రిలీజ్ తర్వాత ”మా సినిమా సూపర్ హిట్” అని చెప్పిన దాఖలాలు కనిపించడం లేదు. దర్శకుడు ప్రెస్ మీట్ పెట్టాడు కానీ ఆ మాత్రం సరిపోదు.
మొన్న సూర్యని తీసుకోండి. తన గ్యాంగ్ సినిమా మంచి టాక్ వచ్చింది. ఆ టాక్ మరింత మందికి చేరువ చేయడానికి ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో టూర్లు మీద టూర్లు వేశాడు. థియేటర్లకు వెళ్లి స్పెషల్ థ్యాంక్స్ లు చెప్పాడు. సూర్య సంగతి ఎందుకు.. బాహుబలి లాంటి బడా సినిమాలు కూడా రిలీజ్ తర్వాత సినిమాని జనాల్లోకి తీసుకువెళ్ళాడని మరింత శ్రమించారు. చక్కగా పబ్లిసిటీ డిజైన్ చేశారు. కానీ భాగమతి విషయంలో ఇది కనిపిచడం లేదు. సినిమాని పదిరోజులు జనాల్లో ఉంచడమే గగనమైపోతున్న రోజులివి. ఇప్పటికే మొదటి మూడు రోజులు గడిచిపోయింది. వీకెండ్ అయిపోయింది. నేటి నుండి పని దినాలు. ఈ గ్యాప్ లో సినిమాని జనాల్లో వుంచడానికి భాగమతి టీం కొంచెం శ్రద్ద తీసుకుంటే ఇంకా మంచి ఫలితాల్ని పొందవచ్చు.
ఇక సినిమా రిలీజ్ కి ముందు కూడా యూనిట్ పెద్దగా ఇంటర్వ్యూ లు, ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసిన దాఖలాలు లేవు. ఏమో రెండు వీడియోలు చేసి మీడియాకి ఇచ్చారు. ఆ కబుర్లే రిపీట్లు పడుతున్నాయి. అందులో సినిమా విడుదలకు ముందు చెప్పిన కబుర్లే వినిపిస్తున్నాయి కానీ ఆల్రెడీ విడుదలై ఒక మంచి రెస్పాన్స్ వచ్చిందన్న కబుర్లు మాత్రం ఇప్పటివరకూ లేవు. ఇక సినిమా టైటిల్ రోల్ పోషించిన అనుష్క కూడా తన సినిమా హిట్ అయ్యిందని మీడియా ముఖ్యంగా చెప్పిన దాఖలాలు లేవు. దర్శకుడు, కళా దర్శకుడు ఎదో కాసేపు మాట్లాడరే కానీ దానికి మీడియాలో స్పెస్ దొరకలేదు. అసలు హీరోయిన్ అనుష్క సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకూ కనిపించలేదు.
సినిమా పాజిటివ్ టాక్ వచ్చిన మాత్రం వాస్తవం. ఈ మాత్రం టాక్ చాలు కుమ్మేద్దాం అనే కాన్ఫిడెన్స్ వుంటే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మారిన ట్రెండ్ ప్రకారం.. సినిమాని జనాల్లో వుంచడం కూడా చాలా ముఖ్యం. సినిమాకి హిట్ టాక్ వస్తే.. దాన్ని బ్లాక్ బస్టర్ దిశగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలా కాదు రిలాక్స్ అయిపోదాం అంటే.. ఛాయిస్ ఈజ్ భాగమతి టీం.