సినిమా వాళ్లు ఎవరెక్కడ, ఎలా ఉన్నా.. మీడియా ముందుకు వచ్చేసరికి మాత్రం వినయం ప్రదర్శిస్తారు. ఇష్టం ఉన్నా లేకున్నా… మీడియాపై ప్రేమ ఒలకబోస్తారు. ఎట్ లీస్ట్.. కెమెరాల ముందు నటిస్తారు. ఇవి కూడా కొంతమందికి చేతకాదు. తమ కోపాన్నంతా మీడియా ముందు ప్రదర్శిస్తుంటారు. శ్రియ ఇప్పుడు ఇదే చేసింది. గత కొంతకాలంగా శ్రియకు తెలుగులో సినిమాల్లేవు. ఇప్పుడిప్పుడే మళ్లీ అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. తాజాగా ‘గాయత్రి’లో ఓ కీలకపాత్రపోషించింది. ‘గాయత్రి’కి సంబంధించిన ఇంటర్వ్యూలు ఈరోజు హైదరాబాద్‌లో జరిగాయి. పాత్రికేయుల పట్ల శ్రియ వ్యవహరించిన తీరు.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ సీరియర్ జర్నలిస్టుని కూడా… ‘మీరేం అడుగుతున్నారో మీకైనా అర్థం అవుతుందా, ముందు మీరు ప్రశ్నించడం నేర్చుకోండి’ అని దురుసుగా మాట్లాడిందట. పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. `మీకెందుకు.. నా పర్సనల్ విషయాలు` అంటూ కటువుగా మాట్లాడింది. ఏ ప్రశ్న వేసినా అడ్డదిడ్డంగా సమాధానం చెబుతుండడంతో పాత్రికేయులు నిరుత్సాహానికి గురయ్యారు. పొటోలకు ఫోజులు ఇవ్వడానికి కూడా శ్రియ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మొత్తానికి ప్రెస్ మీట్లో శ్రియ ప్రవర్తించిన తీరు ఇబ్బందికరంగానే ఉందన్నది జర్నలిస్టుల మాట. ఈ విషయాన్ని మోహన్ బాబు వరకూ తీసుకెళ్లాలని కొంతమంది భావిస్తున్నార్ట. మీడియా అంటే మోహన్ బాబుకి ఎనలేని గౌరవం. మరి శ్రియ ప్రవర్తించిన తీరుకి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో?