ట్విట్టర్‌లో ఎవరో తిడతాడు. ఫేస్‌బుక్‌లో ఇంకెవరో కామెంట్ చేస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మరొకరు ఏదో ఏదో అంటారు. ఎవరెవరో ఏదేదో అంటుంటే సినిమా తారలకు ఎలా ఉంటుంది? రాశి ఖన్నాకు మాత్రం నాకు ఎలాంటి బాధా ఉండదు. ఐ డోంట్ కేర్ అంటున్నారు. తిట్టడమే కాదు, కొందరు ఆకాశానికి ఎత్తేస్తారు. చాలా ఓవర్ గా పొగుడుతారు. నాకసలు అర్థం అంటోందీ ఢిల్లీ డాల్. కెరీర్ కొత్తల్లో బొద్దుగా ఉండే రాశి ఇటీవల బాగా సన్నబడింది. కొందరు రాశి లావుగా ఉన్నప్పుడు బాగుందంటుంటే, కొందరు ఇప్పుడు సన్నగా బాగుందంటున్నారు. అమ్మాయిల బాడీ గురించి ఈలోకంలో మాట్లాడేవారు, అవహేళన చేసేవారు ఎక్కువ. మీరు బాడీ షేమింగ్ వల్ల బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అని రాశి ఖన్నాను అడిగితే… “ఇంతకు ముందు చెప్పినట్టు ‘ఐ డోంట్ కేర్’. మనల్ని ఇష్టపడేవాళ్లు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా ఇష్టపడతారు. కామెంట్స్ చేసేవాళ్ళు మనం ఎలా ఉన్నా కామెంట్స్ చేస్తారు. అందుకే, నేను పట్టించుకోను” అన్నారు. ఫిబ్రవరి 2న రాశి నటించిన ‘టచ్ చేసి చూడు’ విడుదల అవుతోంటే… 9న ‘తొలిప్రేమ’ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో రాశి సందడి చెయ్యడానికి రెడీ అవుతోంది.