వైసిపి అదినేత జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటింది. గత ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి జగన్ ప్రజా సంకల్పయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం మూడువేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్ 74 రోజులుగా యాత్ర చేస్తున్నారు
కడప, కర్నూల్, అనంతపూర్, చిత్తూరు జిల్లాలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న జగన్ వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటిన సందర్భంగా నెల్లూరు జిల్లా సైదాపురం వద్ద ఒక భారీ పైలాన్ స్థూపాన్ని ఆవిష్కరించారు.
దీనిపై తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. మంత్రి కె.ఎస్.జవహర్ దీనిపై వ్యాఖ్యానిస్తూ జగన్ లక్ష కిలోమీటర్లు నడిచినా ముఖ్యమంత్రి కాలేరని వ్యాఖ్యానించారు. జగన్ గతం లో “ప్రత్యేక హోదా కోసం వైసిపి ఎంపి లు రాజీనామా చేస్తారని” చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక హోదాపై వైసిపి ఎంపి లు నిజంగా రాజీనామా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.