సినీ నటుడు సామ్రాట్‌ని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేయడం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అతనిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఇంట్లో చొరబడి దొంగతనం చేయడానికి ప్రయత్నించాడన్నది అభియోగం. అయితే కొంతకాలంగా భార్య, భర్తల మధ్య విబేధాలు తలెత్తాయని టాక్. సామ్రాట్‌కి వివాహేతర సంబంధాలున్నాయని, చెడు వ్యసనాలకు బాసిన అయ్యాడని, అందులోంచి సామ్రాట్‌ని బయటకు లాక్కురావడానికి ఇంట్లోవాళ్లు చాలా విధాలుగా శ్రమించి అలసిపోయారని టాక్. నాలుగు రోజుల క్రితం… భార్యపై సామ్రాట్ దౌర్జన్యానికి దిగాడని, సోమవారం రాత్రి సామ్రాట్ మరోసారి అలాంటి దాడి చేయబోతే.. సామ్రాట్ భార్య, మావయ్య కలసి కట్టుగా పట్టుకుని పోలీసు స్టేషన్‌కి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారని సమాచారం. ప్రస్తుతం సామ్రాట్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. మీడియాతో మాట్లాడ్డానికి కూడా పోలీసులు అనుమతించడం లేదు. సామ్రాట్‌ని ఏదో విధంగా బయటకు తీసుకురావాలని కొంతమంది పెద్ద తలకాయలు కృష్టి చేస్తున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం.