ఫిబ్రవరి 9న రావాలని అటు తొలి ప్రేమ, ఇటు ఇంటిలిజెంట్ టార్గెట్ చేశాయి. ఒకే రోజు రెండు మెగా హీరోల సినిమాలు విడుదలకు సిద్ధం అవ్వడం ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈ రేసు నుంచి చివరికి వరుణ్‌తేజ్ తప్పుకున్నాడు. తొలిప్రేమ ఫిబ్రవరి 10 వస్తోంది. ఈ సినిమాని పంపిణీ చేస్తున్న దిల్‌రాజు తీసుకున్న నిర్ణయం ఇది. దీనిపై ఆయన స్పందించారు. ”మాలో మాకు కమ్యునికేషన్ గ్యాప్ వల్ల ఇద్దరం ఒకే రోజు రావాలని అనుకున్నాం. తొలిప్రేమ ఓ లవ్ స్టోరీ. అందుకే వాలెంటెన్స్ డే కానుకగా.. 9వ తేదీన వస్తే బాగుంటుందని నేనే చెప్పా. అయితే అప్పటికే సి.కల్యాణ్ కూడా తమ సినిమాని ఇదే రోజున విడుదల చేద్దామని భావించార్ట. ఆ విషయం మాకు తెలీదు. మా విషయం ఆయనకు తెలీదు. ఎవరు సినిమా చేసినా నాలుగు డబ్బుల కోసమే. పోటీ పడడం నాకు ఇష్టం ఉండదు. అన్ని సినిమాలూ బాగుండాలి. ఒకే రోజున రెండు సినిమాలు రావడం వల్ల మెగా ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతారు. అందుకే.. మేమే ఓ రోజు వెనక్కి వెళ్తున్నాం” అన్నారు దిల్‌రాజు. ఈగోలకు పోతే రెండు సినిమాలకూ నష్టం ఏర్పడుతుంది. అందుకే బాధ్యతతో తీసుకున్న నిర్ణయమిది… అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు.
అయితే తెరవెనుక మాత్రం చాలా తతంగం నడిచిందని టాక్స్ వినిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి వరకూ రెండు సినిమాలు ‘నువ్వా నేనా’ అనే రేంజులోనే ఉన్నాయని. ఓ దశలో దిల్‌రాజు, సి.కల్యాణ్‌ల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం నడిచిందని, చివరికి దిల్‌రాజే.. కాస్త స్లో అయ్యాడని సమాచారం. మొత్తానికి మెగా ఫ్యాన్స్‌ని కన్ఫ్యూజ్ చేయకుండా మంచి నిర్ణయమే తీసుకున్నారు.