ఫిబ్రవరి 2న చలో, 9న ఇంటిలిజెంట్ సినిమాలు వస్తున్నాయి. చలోకి టాక్ బాగానే ఉంది. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేస్తున్నారు. అయితే… బిజినెస్ పరంగా మాత్రం కాస్త వీక్‌గా కనిపిస్తోందని టాక్. అన్ని ఏరియాల నుంచి అడ్వాన్సులు అందుతున్నా.. అవన్నీ నామమాత్రపు అంకెలని, దాదాపుగా ఓన్ రిలీజ్ లాంటిదని తెలుస్తోంది. నైజాంలో అయితే అడ్వాన్సులు కూడా రాలేదు. ఈ సినిమాని నైజాంలో నాగశౌర్యనే సొంతంగా విడుదల చేస్తున్నాడు. ఇంచుమించుగా వినాయక్ – సాయిధరమ్ తేజ్‌ల ఇంటిలిజెంట్దీ ఇదే పరిస్థితి. వినాయక్ సినిమా కాబట్టి, రేట్లు బాగానే వస్తాయని నిర్మాత సి.కల్యాణ్ రిలాక్సయిపోయారు. కానీ అదేం కనిపించడం లేదు. నైజాంలో ఈ సినిమాని రూ.9 కోట్లకు అమ్ముదామనుకున్నారు కల్యాణ్. కానీ పార్టీలు మాత్రం రూ.2, రూ.3 కోట్ల దగ్గరే ఆగిపోతున్నాయి. దాంతో.. ఈ సినిమాని నైజాం వరకూ సొంతంగా విడుదల చేసుకుందామని కల్యాణ్ డిసైడ్ అయిపోయారు. సంక్రాంతి దెబ్బ నుంచి పంపిణీదారులెవరూ తేరుకోలేదు. 26న వచ్చిన భాగమతి మాత్రం కాస్త ఉత్సాహపరిచింది. అయినా సరే.. సినిమాల్ని భారీ రేట్లకు కొనాలంటే వణికిపోతున్నారు. అందుకే కొంతకాలం ఆచి తూచి నిర్ణయాలు తీసుకుందామని డిసైడ్ అయ్యారు. దాంతో ఇప్పుడు రాబోతున్న సినిమాలకు పంపిణీదారులు దొరకడం లేదు.