నిఖిల్ కథానాయకుడిగా నటించిన చిత్రం కిరార్ పార్టీ. కేశవ కాస్త నిరుత్సాహపరచడంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు నిఖిల్. 9న రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే… ఇప్పుడు 9న రావట్లేదు. ఏకంగా వేసవికి షిప్ట్ అయిపోయింది. కాలేజీ నేపథ్యంలో సాగే కథ ఇది. యువ ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించేంత విషయం కథలో ఉంది. సినిమా మొత్తం వాళ్లని టార్గెట్ చేసి తీసినదే. టీజర్ చూస్తే ఆ విషయం అర్థం అవుతోంది. అయితే.. ఫిబ్రవరి, మార్చి సినిమాలకు సంబంధించి చాలా బ్యాడ్ సీజన్. పరీక్షా సమయం కాబట్టి.. యువతరం థియేటర్ వైపు అడుగులు వేయడానికి ఆలోచిస్తారు. ఫిబ్రవరి 9 దాటితే పరీక్షల సీజన్ మొదలైపోతుంది. అందుకే కిరాక్‌పార్టీ వెనకడుగు వేసింది. ఇక ఏకంగా వేసవి సెలవుల్లోనే ఈ సినిమాని విడుదల చేయాలని ఫిక్సయ్యింది. దాంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా జరగాల్సివుందట. అవన్నీ తీరిగ్గా చేసుకొని, ప్రమోషన్లపై దృష్టి పెట్టి, వేసవిలో విడుదల చేద్దామని టీమ్ నిర్ణయించుకుంది.