- హీరోయిన్‌కి ఎలా లవ్ ప్రపోజ్ చేయాలా? అని రిఫరెన్స్ కోసం హీరో తెలుగు సినిమాల్లో సీన్లు చూస్తాడు. అందులో ముందు వచ్చే సీన్ ‘ఆర్య’లో అల్లు అర్జున్ హీరోయిన్‌కి ప్రపోజ్ చేసే సీన్!
- ‘ఏవండీ… మీరు ఖైదీ నెంబర్ 150 చూశారు కదా! సైరా నరసింహారెడ్డి అంతకంటే బాగుంటుంది. నాకు కథ తెలుసు’ – లెక్చరర్ పోసాని కృష్ణమురళి డైలాగ్.
- ప్రేమలో పడిన తర్వాత హీరో ఫస్ట్‌టైమ్ హీరోయిన్ ఇంటికి వెళతాడు. హీరోయిన్ ఇంట్లో ఏదో ఫంక్షన్. అక్కడ రష్మిక మండన్న పూల దండలను డెకరేట్ చేస్తుంటుంది. హీరో చూపులు అనుకోకుండా ఆమె నడుము మీద పడతాయి. నాభి కనిపిస్తుంది. హీరోయిన్ కాస్త కోపంతో నవ్వుతూ కవర్ చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’లో టెర్రస్ సీన్ గుర్తుకు వస్తుందంటే నమ్మండి!
‘ఛలో’ సినిమాలో కుదిరిన ప్రతిసారి మెగా మీటర్‌ను బాగా టచ్ చేశారు. ‘ఛలో’ హీరో నాగశౌర్య, మెగా డాటర్ నీహారిక లవ్‌లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నాగశౌర్య ఈ వార్తలను ఖండించినా ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ‘ఛలో’లో సీన్లు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. నాగశౌర్య…. వాట్ అమ్మా? వాట్ ఈజ్ థిస్ అమ్మా? అనుకుంటున్నారు జనాలు.