బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాలకు కథ అందించి దేశంలోనే స్టార్ రైటర్‌గా ఎదిగారు విజయేంద్ర ప్రసాద్. తమిళనాట సంచలనాలు సృష్టించిన మెర్శల్కీ ఆయనే రైటర్. విజయేంద్రుడి నుంచి ఏ కథ వచ్చినా… ఇప్పుడు ఆ సినిమా సమ్‌థింగ్ స్పెషల్‌గా మారింది. ఈ దశలో రచయితగా ఆయనకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇప్పుడాయన మంచు విష్ణు కోసం ఓ కథ సిద్ధం చేసినట్టు సమాచారం. ఇది కూడా సామాజిక అంశాల చుట్టూ తిరిగే వాణిజ్య చిత్రమని తెలుస్తోంది. ఈ కథని డీల్ చేసే దర్శకుడి కోసం విష్ణు అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. విష్ణు నటించిన ‘గాయత్రి’ వారంలో విడుదల అవుతోంది. ఆ తరవాత ‘ఆచారి అమెరికా యాత్ర’ వస్తుంది. ‘ఓటర్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. విజయేంద్ర ప్రసాద్ కథ.. వేసవిలో సెట్స్‌పైకి వెళ్లొచ్చు. ఈలోగా దర్శకుడు ఎవరన్నది తేలుతుంది.