కత్తి మహేష్ – పవన్ ల వివాదం ఎలాగో సద్దుమణగింది. ఇప్పుడు రవితేజ సినిమా మీద కత్తి ఇచ్చిన రివ్యూ తో రవితేజ అభిమానులు ఆయనమీద మటల తూటాలు పేలుస్తున్నారు. ఇంతకీ ఆయన రివ్యూ ఏమిచ్చారంటే –
“టచ్ చేసి చూడు అర్థం పర్థం లేని యాక్షన్ డ్రామా. సెన్స్‌లెస్ స్టోరీ. ఎయిమ్‌లెస్ సీన్స్. రవితేజ టైమ్ వేస్ట్ చేసుకున్నాడు. టచ్ చేయకపోతేనే బెటర్” – దీనిపై మండి పడ్డ రవితేజ అభిమానులు, నెటిజన్లు ‘సినిమా చూడొద్దు అని చెప్పడానికి నువ్వెవరు? అది ఆడియెన్స్ డెసిషన్’. అంటూ కత్తి మహేష్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే కత్తి మహేష్ దీనిపై కూడా స్పందించారు.- “సినిమా నచ్చితే చూడమని రెకమండ్ చేసినట్టే. నచ్చకపోతే,చూడకపోతే బెటర్ అని కూడా చెప్తామ్! ఛాయ్స్ ప్రేక్షకుడిది. అదే అల్టిమేట్. రివ్యూ అంటేనే అభిప్రాయం. అది ఇలాగే ఉండాలి అని ఎవరూ డిసైడ్ చెయ్యలేరు” అంటూ ట్వీట్ చేసాడు. ఇక కత్తి మహేష్ మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచే హైపర్ ఆది కూడా చిన్నపాటి సెటైర్ వేసాడు – “ముందు మీరొక మంచి సినిమా తీయండి, ఆ తర్వాత వచ్చి రివ్యూలు వ్రాయండి” అంటూ స్పందించారు.
కానీ ఏ మాటకామాటే చెప్పాలి. రవితేజ సినిమా పరమ రొటీన్ గా ఉందని, ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో అరగదీసిన పాత ఫార్ములా తో తెరకెక్కిన ఈ సినిమాని కత్తి మహేష్ లాంటి క్రిటిక్ లే కాదు, ” టచ్ చేయడానికి “తాము కూడా వెనుకాడుతున్నామనీ సామాన్య జనం అంటున్నారు