`సైరా` ప్రీ ప్రొడక్షన్ విషయంలో చిరంజీవి ఎక్కడా రాజీ పడడం లేదు. ప్రస్తుతం కాస్ట్యూమ్స్‌కి సంబంధించిన వర్క్ ఉధృతంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ ఎకరం విస్తీర్ణంలో వర్క్ షాప్ సాగుతోంది. అక్కడ సైరా కాస్ట్యూమ్స్ రెడీ అవుతున్నాయి. పద్మావత్ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన చంద్రకాంత్ సోనావానే ఈ చిత్రానికి కూడా వర్క్ చేస్తున్నారు. చిరంజీవి తనయ సుస్మిత కూడా కాస్ట్యూమ్స్‌లో చేదోడు వాదోడుగా ఉంటోంది. దాదాపు మూడొందల మంది వర్కర్స్ రాత్రి పగలూ ఈ వర్క్ షాప్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు సెట్స్ కి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. 2019 ఏప్రిల్‌లో ఈ సినిమాని విడుదల చేయాలన్నది చిరంజీవి ఆలోచన. వేసవి బరిలో దిగితే తప్ప… బడ్జెట్ కి తగిన రాబడి ఉండదని చిరు భావిస్తున్నాడ. `సైరా`లో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే… ఈ టీమ్ నుంచి బిగ్ బీ తప్పుకున్నాడని వార్తలొచ్చాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదని చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది.