బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని ఢీకొట్టబోతున్నాడు ఖిలాడీ అక్షయ్ కుమార్. ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బీకి పోటీ ఇస్తున్నాడు. ఇలాంటి ప్రిస్టేజియస్ ప్రాజెక్టులో భాగం కావడం ఎంతో అదృష్టం అంటున్నాడు అక్కీ. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాజెక్టు బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ పేరు ఖాయమైనట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం గుజరాత్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాలీవుడ్ మెగాస్టార్ ని నేషనల్ లెవల్లో తీసుకోవాలనుకున్నారు. అయితే.. సడన్ గా స్క్రీన్ మీదకు వచ్చాడు అక్షయ్.
లేటెస్ట్ గా ఎయిర్ లిఫ్ట్ లాంటి జాతీయ భావం నిండిన సినిమాలో హీరోగా యాక్ట్ చేశాడు అక్కీ. 1990లో కువైట్ మీద ఇరాక్ దాడులకు పాల్పడింది. ఆ టైమ్ లో కువైట్ లో ఉన్న భారతీయులను ఇండియాకి క్షేమంగా చేర్చడమే ఈ ఎయిర్ లిఫ్ట్ మూవీ కథ. అందులో లక్షా 70వేల మందిని ఇండియాకి చేర్చడమే సినిమా. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. అక్షయ్ కి కూడా మంచి పేరు తెస్తోంది. ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్ సందర్భంగా తన మనసులో మాట బయటపెట్టాడు అక్షయ్.
అయితే… ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రేస్ లో అమితాబ్, అక్షయ్ తో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా కూడా పోటీ పడుతున్నారు. ఈ నలుగురిలో ఒకర్ని సెలక్ట్ చేసే చాన్స్ ఉంది. ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఆమిర్ టెర్మ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత మరొకరిని సెలక్ట్ చేయడానికి టైమ్ తీసుకుంటోంది ప్రభుత్వం.